నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను
నేనేమైయున్నానో నీ దయవలనేనయ్యా
నాకున్నన్నియు నీవిచ్చినవేనయ్యా
లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే
ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు నీకు అర్పించిన అబ్రహాములా
సర్వము పోయిన శరీరం కుళ్ళిన నా అనేవారు వెలివేసినా ఆప్తులంతా శత్రులైన అంతము వరకు సహించిన ఆ యోబులా
నామట్టుకైతే బ్రతుకుట క్రిస్తే చావైనా అది నాకెంతో మేలు ఇదిగో నేను ఉన్నానయ్య దయతో నన్ను గైకొనుమయా నా యేసయ్య