"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: July 2017

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

shasvata prematho nannu preminchaavaya

శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయా
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయా
కృపచేతనే నన్ను రక్షించావయా
నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది – నీ కృపా గొప్పది – నీ దయా గొప్పది
1.  అనాధనైన నన్నువెదకి వచ్చితివి
ప్రేమ చూపి కౌగలించి – కాచుకొంటివి
2.  తల్లి గర్భమందు నన్ను ఎరిగియుంటివి
తల్లిలా ఆదరించి నడిపించితివి
3.  అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్యా చేర్చుకొంటివి
4.  నడుచుచున్న మార్గమంత యోచింపక

కన్నీళ్ళతో స్తుతియించి – స్తోత్రింతునయ్యా

PPT  📥

Snehitudu praana priyudu

స్నేహితుడు ప్రాణ ప్రియుడు
స్నేహితుడు ప్రాణ ప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు || 2 ||
నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు || 2 ||
వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా
1.        తోడు నీడ లేని నన్ను చూడ వచ్చెను జాడలు వెదికి జాలి చూపెను || 2 ||
పాడైన బ్రతుకును బాగుచేసెను ఎండిన మోడులే చిగురించెను || 2 || || వినుమా ||
2.        దాహము కోరి – నే దూరమరిగితి   మరణపు మార దావురించెను|| 2 || 
     క్రీస్తే జీవం – మధురమాయోను 
     క్షీరద్రాక్షలు సేదదీర్చెను || 2 || || వినుమా ||

3.        బాధలలో నన్ను ఆదరించెను శోధనలందు తోడు   నిల్చెను || 2 ||
నా మొరలన్ని ఆలకించెను నా భారమంతయు తొలగించెను || 2 || || వినుమా ||

PPT 📥 

Stuthiyu mahimayu neeke



స్తుతియు మహిమయు నీకె

స్తుతియు మహిమయు నీకె – క్షితికిన్ దివికిన్ నీటి – వితతికిన్ కర్తవై – వెలయు మా దేవా = ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు – హితుడా మా ప్రేమ నీ – కెట్లు చూపుదుము
1.   పసిడి వర్ణపు టెండ - భాగ్య ధారల వాన -
విసరు మంచి గాలి - విరియు పుష్పములు =
రస మొల్కు పండ్లు నీ - రమ్య ప్రేమన్‌ జూటున్ -
బ్రసరించు కోత లో - పల నుందు వీవు
2.   నెమ్మదిగల యిండ్లు - నిజసౌఖ్య కాలములు – ఇమ్మహి ఫలియించు – నైశ్యర్యాధికముల్ = ఇమ్ముగ గలిగిన – హృదయులమై వంద – నమ్ముల ఋణపడి  యు - న్నాము నీకు
3.   దురితంబు లోనరించి – దౌర్భాగ్య స్థితి నన్ను – ధరణికి నీ పుత్రున్ – ధర్మంబు జేసి = నరుల కీ ధర్మమున – కొరత దీర్చెడు సర్వ - వరము లమర్చిన – పరమోపకారి
4.   జీవంబు ప్రేమను – జేవ గల్గించెడు – పావనాత్మను మాకై – పంపితివి = దీవెన లేడు రె – ట్లావరింపను మమ్ము – నీ విమలాత్మ వా – నిని గుమ్మరించు
5.   నరులకు విమోచ – నము గల్గె పాపంబుల్ – పరిహార మాయె గృ – పాసాధనముల్ = దొరికె మోక్షాంశంబు – స్థిరమాయె మేము నీ – కొరకేమి తేగలము – పరిపూర్ణ జనకా
6.   మాకై వాడుకొనెడి - రూకల్ వ్యర్థం బగును – నీకై యప్పుగ నిచ్చు – నిఖిల వస్తువులు =  శ్రీకరంబగు నిత్య – శ్రేష్ట ధననిధియై పై – లోకంబు నందుండు – లోపంబు లేక
7.   జీవంబు వస్తువులు – శ్రేయస్సు దాన స్వ – భావంబు శక్తియు- భాగ్యంబులు = నీవలననే లభ్యమై వెలయుచున్నవి – నీ వాసమే మాకు – నిత్యానందంబు


PPT 📥





Samanulevaru prabho | Christian songs telugu | Telugu Christian Song

సమానులెవరు ప్రభో – నీ - సమానులెవరు ప్రభో

సమానులెవరు ప్రభో – నీ - సమానులెవరు ప్రభో = సమస్త మానవ - శ్రమాను భవమున్ – సహించి వహించి – ప్రేమించగల నీ

1.   సమాన తత్వము – సహోదరత్వము = సమంజసము  గాను – మాకు దెలుప నీ

2.   పరార్ధమై భవ – శరీర మొసగిన = పరోపకారా – నరావ తార

3.   దయా హృదయ యీ – దురాత్ము లెల్లరిన్ = నయాన భయాన – దయాన బ్రోవ నీ


4.   ఓ పావనత్ముడ – ఓ పుణ్య శీలుడ = పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుతునీ

  Download Lyrics as PPT



Bheekarundau Maa Yehovaa

భీకరుండౌ మా యెహోవా
భీకరుండౌ మా యెహోవా పీఠ మెదుటన్ గూడరే
ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే            ||భీకరుండౌ||

మట్టితోనే మమ్ము నెల్ల మానవులుగ సృజించెను
ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము   || భీకరుండౌ ||

ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను
ధారుణిన్ దానొక్కడే మా దైవమని పూజింతుము     || భీకరుండౌ ||

పుట్టగిట్టన్ జేయ దానై నట్టి దేవుని శక్తిని
బట్టుగా లోకస్తులారా ప్రస్తుతింపరే భక్తిని                 || భీకరుండౌ ||

మేటి సంగీతంబులపై మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్ళన్ సన్నుతుల్ ప్రభు వందను       || భీకరుండౌ ||

మిక్కిలి కష్టంబులతో మిత్తికిని బాల్పొందను
దిక్కు లేని గొర్రెలట్లు దిరుగ జేర్పన్ మందను           || భీకరుండౌ ||


PPT 📥


Neeti gala Yehova


నీతిగల యెహోవ స్తుతి
నీతిగల యెహోవ స్తుతి మీ - యాత్మతో నర్పించుడి - మీ యాత్మతో సేవించుడి
దాతయౌ మన క్రీస్తు నీతిని - దాల్చుకొని సేవించుడి || నీతి ||

1.    చదలఁ బుడమియు రవియు జలధియు - నదులు గిరులును జక్కగా
సదమలంబగు దైవ నామము - సర్వదా నుతిఁజేయను || నీతి ||

2.    సర్వశక్తుని కార్యములకీ - సర్వ రాష్ట్రము లన్నియు
గర్వములు విడి తలలు వంచుచు - నుర్విలో నుతిఁజేయను || నీతి ||

3.    గీత తాండవ వాద్యములచేఁ - బ్రీతిపరచెడు సేవతో
పాతకంబులు పరిహరించెడు - దాతనే సేవించుఁడి || నీతి ||

4.    పరమదూతలు నరులు పుడమిని - మొరలు బెట్టుచు దేవుని
పరము నందున్నట్టి యేసుని - పాదములు సేవింతురు || నీతి ||

5.    ఇలను భక్తులు గూడుకొనియా - బలము గల్గిన దేవుని
వెలయు స్తుతి వే నోళ్లతోడను - విసుగు జెందక జేయుడి || నీతి ||


6.    ఆత్మ నీవిఁక మేలుకొని శు - ద్దాత్మఁ యేసుని దండ్రిని
త్రిత్వమగునా యేక దేవుని - హర్షమున సేవింపవే || నీతి ||

    Download Lyrics as PPT

A Halleluya Shuddhuda

ఆ హల్లెలుయా (శుద్దుడా శుద్దుడా)
ఆ హల్లెలుయా ఆ హల్లెలుయా
ప్రభుయేసుడే యేలును

ఆ హల్లెలుయా ఆ హల్లెలుయా
ప్రభుయేసుడే యేలును

ఆ హల్లెలుయా ఆ హల్లెలుయా

శుద్దుడా శుద్దుడా పరిశుద్ద ప్రభువా
అర్హుడవుఅర్హుడవు

శుద్దుడా శుద్దుడా పరిశుద్ద ప్రభువా
అర్హుడవుఅర్హుడవు ఆ.. మేన్..


Stotrarpana narpintamu

స్తోత్రార్పణ నర్పింతము
స్తోత్రార్పణ నర్పింతము – జప ధూపము వేసి కీర్తింతము = పాత్రుం డైన
శ్రీ యేసుడు – పరమ – భోజనాంశమైనందున
1.    కృతజ్ఞతా స్తోత్రంబులన్ – దేవ – కృపార్ధంబై చేయుదము = క్షీతి నాతండు
బలి నియ్యగా – పుట్టె - నూతనంపు  నిబంధన
2.    పాపము లన్ని హరించెను – మా – ప్రభు వగు యేసు సురక్తము = ఏపుగ దీని దలంచుచు – నిక – నెన్నడు యేసుని భజింతము
3.    చావు నుండి రక్షించెను – స – జీవులలో  లేక్కించెను = దేవుని కి క నర్పింతము స – జీవార్పణ బలిగను
4.    పుణ్యరక్త శరీరముల – లో పాలొందు మన మందరము = అన్యులము కానేరము – దై – వాన్యోన్యంబు నొందినాము

5.    మరణ శ్రమలు స్మరింతము – ప్రభు – తిరిగి వచ్చు పర్యంతము = ధర నా యేసు మరణంబును – యింక చిరకాలంబు జాటింతము 

PPT 📥


Yeriti nee runam


ఏ రీతి నీ రుణం తీర్చుకొందు నేసువా

ఏ రీతి నీ రుణం తీర్చుకొందు నేసువా
ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా
ఎంతో కృపను చూపి మము దీవించినావయ్యా –  ఆ –
1.                          పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్దుని చేసావయ్యా
2.                          నా పాప శిక్ష సిలువపై
భరియించినావయ్యా

నా దోషములను క్షమియించి నను ప్రేమించినావయ్యా

 

YE REETHI NEE RUNAM

Ye Reethi Nee Runam Theeerchukondu Yesayyaa (2)
Ye Dikku Leni Nannu Preminchinaavayyaa
Entho Krupanu Choopi Deevinchinaavayyaa

Paapaala Sandramanduna Payaninchu Velalo (2)
Paashaana Manasu Maarchi Parishuddhuni Chesaavayyaa   
||Ye Reethi||

Naa Paapa Shiksha Siluvapai Bhariyinchinaavayyaa (2)
Naa Doshamulanu Grahiyinchi Kshamiyinchinaavayyaan  
||Ye Reethi||

 

Download Lyrics as PPT


Aaradhana Landuko

ఆరాధనలందుకో ఆరాధనలందుకో
ఆరాధనలందుకో ఆరాధనలందుకో పాప క్షమాపణ జీవమునిచ్చినా – కరుణామయా అందుకో – 2
1.               పాపంబున జన్మించి నశియించితిని - లోకంబునాదంచు ఆశించితిని – అయినా నీవు రక్షణ నివ్వ
ప్రేమించి పంపితివి యేసు ప్రభుని
ఘనత మహిమ నీకేయని – హల్లెలూయ గానము చేసెదను 
పాప క్షమాపణ జీవమునిచ్చినా – కరుణామయా అందుకో
2.               తెలిసికొంటిని నా యేసు నిన్ను సర్వశక్తిగల ప్రభువనియు రానున్నావు మరలా నాకై  ఆనంద దేశములో నన్నుంచుటకై

3.               అంద సౌందర్యంబులు వ్యర్ధమని – ఆశించితివి ముత్యంబుగ నుండుటకై నిన్నా నేడు నిరంతరము మారని – మా ప్రభువా స్తుతులు

Download Lyrics as PPT


Neeto Samamevvaru neela preminchedevvaru

నీతో సమమెవరు నీలా ప్రేమించెదెవ్వరు
నీతో సమమెవరు నీలా ప్రేమించెదెవ్వరు
నీలా క్షమించేదెవరు యేసయ్యా
నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవ్వరు
1.            లోక బంగారము ధన ధాన్యాదులు
ఒక పోగసిన నీతో సరితూగునా
జీవనదులన్నీయు సర్వ సాంద్రాములు
ఒకటై ఎగసిన నీకు తాకగలవా
నీలా పరిశుద్ధ దేవుడు ఎవరు ఉన్నారయ్యా
నీవేగా మంచి దేవుడవు
2.            పలువేదాలలో మత గ్రంధాలలో
పాపమే శోకనీ పరిశుద్ధుడేడి
పాపపరిహారార్ధం సిలువ మరణమొంది తిరిగి
లేచినట్టి దైవ నరుడెవ్వరు...
నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి
నీవేగా మా విమోచకుడవు
3.            నేను వేదకకున్నా నాకు దొరికితివి
నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి
నీకు గాయాలు చేసి తరచు రేపితినీ
నన్నెంతో సహించి క్షమించితివి
లోక సౌఖ్యలన్ని ఒక చోట కుమ్మరించినా
నీవేగా చాలిన దేవుడవు 

PPT 📥

SONG REQUEST

Name

Email *

Message *