"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: March 2016

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Siluvalo aa siluvalo

సిలువలో ఆ సిలువలో
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రెలడిన యేసయ్యా
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా

1)           నేరము చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు
కొరడాలు చెల్లని చిల్చెనే నీ సుందర దేహమునే తడిపెను నీ తనువునే రుధిరంబు ధారాలే

2)           వధకు సిద్ధమైన గోర్రపిల్లవోలే
మోమున ఉమ్మివేయ మౌనివైనావే
ధూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా

3)           నాదు పాపమే నిన్ను సిలువకు గురిచేసెన్
         నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్
నీవు కార్చిన రక్తధారులే నా రాక్షణాదారం

  సిలువను చేరెదను విరిగిన హృదయముతోను

Idhigo deva naa jevitham


"Therefore, I urge you, brothers and sisters, in view of God’s mercy, to offer your bodies as a living sacrifice, holy and pleasing to God this is your true and proper worship. Do not conform to the pattern of this world, but be transformed by the renewing of your mind. Then you will be able to test and approve what God’s will is his good, pleasing and perfect will"

                             Romans 12:1-2

ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీ కంకితం
ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీ కంకితం
శరణం నీ చరణం - శరణం నీ చరణం (x2)||ఇదిగో||

చరనం 1

పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు - తగినట్లు జీవించనైతి  (x2)
అయినా నీ ప్రేమతో - నన్ను దరి చేర్చినావు
అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం  ||ఇదిగో||

చరనం 2

నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయ నేర్పు  (x2)
ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||


చరనం 3

విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము
కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు  (x2)
నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా
క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా 
||ఇదిగో||


Download Lyrics as PPT




Parishudha parishudha


"HOLY, HOLY, HOLY is THE LORD GOD, THE ALMIGHTY, WHO WAS AND WHO IS AND WHO IS TO COME.
"

Revelation 4:8



పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా
పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా
పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా = వరదూత లైన నిన్‌ - వర్ణింప గలరా ||పరిశుద్ధ||



1)           పరిశుద్ధ జనకుడ - పరమాత్మరూపుడ = నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా ||పరిశుద్ధ||



2)           పరిశుద్ధ తనయుడ - నరరూపధారుడ = నరులను రక్షించు - కరుణా సముద్రా ||పరిశుద్ధ||



3)           పరిశుద్ధ మగు నాత్మ = వరము లిడు నాత్మ = పరమానందప్రేమ - భక్తుల కిడుమా ||పరిశుద్ధ||



4)           జనక కుమారాత్మ - లను నేక దేవా = ఘనమహిమ చెల్లును - దనర నిత్యముగా 
||పరిశుద్ధ||




PARISHUDHA PARISHUDHA 
Parishudha parishudha parishudha prabhuva
Parishudha parishudha parishudha prabhuva
Varadutalinanin varnimpa galara

1.  Parishudha janakuda paramaatma ruupuda
Nirupama balabhuddhi neeti prabhaava

2.  Parishudha tanayuda nararupadharuda – narulanu rakshinchu karunaa samudra

3.  Parishudha maghu naatma varamu lidu naatma – paramaanadaa prema bhakthula kiduma


4.  Janaka kumaaratma lanu neka devaa – ghanamahima chellunu danaraa nityamugaa


Seeyonu kanya sambrama paduchu

సీయోనుకన్యా - సంభ్రమపడుచు
సీయోనుకన్యా - సంభ్రమపడుచు - వేయుము కేకల్‌
పాయక నీ రాజు - భారవాహక మెక్కి - బాలస్తోత్రములతో - బైలుదేరి వచ్చె ||సీయోను||
1)           హెబ్రాయిలోను - నీ రాజు పేరు - యూదులరాజే = హెబ్రీయ జను లను - ఆబ్రాము కొడుకులను - విభవదేశము జేర్చు - శుభరాజు యీతండే ||సీయోను||
2)           హెల్లేనీలోను - నీ రాజుపేరు - యూదులరాజే = యెల్లపాపుల బ్రోచు - తాల్మిరక్షకుడితడు - చల్లని ప్రభువని - గొల్లొత మ్రోగెను ||సీయోను||
3)           ఉర్వి రోమాలో - నీరాజుపేరు - యూదులరాజే = సర్వరాష్ట్రికులకు -బూర్వపితరులతోను -
వరసింహాసన మిచ్చు - వరదేశాధిపు డితడు ||సీయోను||
4)           వాసిగ హెబ్రీ - హెల్లేనీలో రోమాయిలోను = హోసన్నా హోసన్నా - ప్రభుని పేరట వచ్చు - మెస్సీయ్యదావీదు - కొడుకా శ్రీ శుభములు ||సీయోను||

Anni eevulaku anni varamulaku

అన్ని ఈవులకు అన్ని వరములకు
అన్ని ఈవులకు అన్ని వరములకు - ఊటయగు - మా యేసువా - 2
నిన్ను నేను స్తుతించేదాను - స్తుతి స్తోత్ర - గీతంబులతో 2
1)          పాప గోతిలో - పడి యుంటిని చీకటి నన్ను - ఆవరించెను - 2
ప్రభుచేజాచి - చేరదీసేను - నిజద్రాక్షవల్లిగ మార్చెను - 2  ||అన్ని||
2)          శ్రేష్టమౌ ద్రాక్షావళ్ళియందు - చేర్చినావు ఫలించే తీగగా - 2
ఫలభరితమైన - ఫలముల్‌ - ఫలించుటకు - ప్రభుసేవలో - 2 ||అన్ని||

3)          పరిశుద్ధాత్మతో నింపుము - ప్రభువా నీలో నిలుచుటకై - 2
ఫలియించు ద్రాక్షవళ్ళిగా - ఆత్మ వరములతో నింపుము - 2 ||అన్ని||

PPT 📥

Kanna talli cherchunatlu

కన్న తల్లి చేర్చునట్లు

కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నాప్రియుడు
హల్లెలూయా హల్లెలూయా


1. కౌగిటిలో హత్తుకొనున్ నా చింతలన్ బాపును
2. చేయిపట్టి నడుపును శిఖరముపై నిలుపును

3. నా కొరకై మరణించె నా పాపముల్ ధరియించె
4. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు

Download Lyrics as PPT

Naa pere teliyani prajalu


"Therefore go and make disciples of all nations, baptizing them in the name of the Father, and of the Son, and of the Holy Spirit."

Matthew 28:19



నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు
నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు
నా ప్రేమను  వారికి ప్రకటింప కొందరే వున్నారు
ఎవరైనా మీలో ఎవరైనా వేలుతారా నా ప్రేమను చెపుతారా


1.  నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు
వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు

2. రక్షణ నొందిన ప్రజలు లక్షలకొలదిగా వున్నారు
మారు మూలల గ్రామంలో ఊరిలోపల  వీధుల్లో


3. వెళ్లగలిగితే మీరు తప్పక వెళ్లండి

వెళ్లలేకపొతే వెళ్ళేవారిని  పంపండి

Download Lyrics as PPT

Randi Stuthinchuchu Paaudi


"Rejoice in the LORD, O you righteous; befitting is the praise of the upright."

Psalm 33:1


రండి స్తుతించుచు పాడుడి
రండి స్తుతించుచు పాడుడి -
రారాజు యేసుని చేరుడి


''హల్లెలూయ హల్లెలూయ
 హల్లెలూయ హల్లెలూయ''


1.          ప్రభు యేసు కాంతిలో నిలచి -
సాగించు జీవితయాత్ర
బాధలన్నిటిన్‌ బాపున్‌ -
భజియించు యేసుని నామం
 ||
హల్లెలూయి||


2.          విలువైన నీ జీవితమున్‌ -
వెలిగించుము ప్రభుకొరకు
పరిశుద్ధాత్మను పొంది -
ప్రభు వాక్కులు ప్రచురించు 
||హల్లెలూయి||


3.          మరణము జయించి లేచెన్‌ -
మరణపు ముల్లును విరిచెన్‌
మధురము యేసుని నామం -
మరువకు యేసుని ధ్యానం
  
||హల్లెలూయి||

Download Lyrics as PPT

Kristhea sarvadikari

క్రీస్తే సర్వాధికారి
క్రీస్తే సర్వాధికారి -
క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి -
క్రీస్తే ఆ సిల్వధారి


1.          ముక్తి విధాతనేత -
శక్తి నొసంగుదాత
భక్తి విలాపశ్రోత -
పరమంబు వీడె గాన ||క్రీస్తే||

2.          దివ్య పథంబురోసి -
దైవంబు తోడుబాసి
దాసుని రూపుదాల్చి -
ధరణి కేతెంచెగాన ||క్రీస్తే||

3.          శాశ్వత లోకవాసి -
సత్యామృతంపురాశి
శాప భారంబు మోసి -
శ్రమల సహించెగాన ||క్రీస్తే||

4.          సైతాను జనము గూల్పన్ –
పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంప -
రుథిరంబు గార్చెగాన

5.          మృత్యువు ముల్లు తృంపన్ –
నిత్యజీవంబు బెంపన్
మర్త్యాళిభయము దీర్పన్ –
మరణంబు గెలిచెగాన

6.          పరమందు దివిజులైన -
ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు –
ప్రభునే భజించు గాన

7.          ఈ నామమునకు మించు -
నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్‌ -

హెచ్చించినాడు గాన ||క్రీస్తే||


Devasamstuthi cheyavea manasa

దేవ సంస్తుతి చేయవే మనసా

దేవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీ -
మంతుడగు యెహోవా
సంస్తుతి చేయవే మనసా =
దేవ సంస్తుతి చేయుమా నా -
జీవమా యెహోవా దేవుని -
పావన నామము నుతించుమా -
నా యంతరంగము -
లో వసించు నో సమస్తమా ||దేవ||

1.  జీవమా, యెహోవా నీకు -
జేసిన మేళ్లన్‌ మరవకు =
నీవు చేసిన పాతకంబులను -
మన్నించి జబ్బు -
లేవియున్‌ లేకుండ జేయును -
ఆకారణముచే ||దేవ||

2.  చావు గోతినుండి నిన్ను -
 లేవనెత్తి దయను గృపను =
జీవ కిరీటముగ వేయును -
నీ శిరసుమీద జీవ కిరీటముగ వేయును -
ఆ కారణముచే ||దేవ||

3.  యౌవనంబు పక్షిరాజు -
 యౌవనంబు వలెనె క్రొత్త =
యౌవనంబై వెలయునట్లుగ -
మే లిచ్చి నీదు -
భావమును సంతుష్టిపరచునుగా -
ఆ కారణముచే ||దేవ||

4.  ప్రభువు నీతి పనులు చేయున్‌ -
బాధితులకు న్యాయ మిచ్చు =
విభుడు మార్గము తెలిపె, మోషేకు -
దన కార్యములను -
విప్పె నిశ్రాయేలు జనమునకు -
ఆ కారణముచే ||దేవ||

5.  అత్యధిక ప్రేమ స్వరూపి -
యైన దీర్ఘ శాంతపరుడు -
నిత్యము వ్యాజ్యంబు చేయడు -
ఆ కృపోన్నతుడు -
నీ పయి నెపుడు కోపముంచడు -
ఆ కారణముచే ||దేవ||

6.  పామరుల మని ప్రత్యపకార -
ప్రతి ఫలంబుల్‌ పంపలేదు =
భూమి కన్న నాకసంబున్న -
యెత్తుండు దైవ - 
ప్రేమ భక్తి జనుల యందున ఆ కారణముచే ||దేవ||

7.  పడమికి దూర్పెంత యెడమో - 
పాపములకును మనకు నంత =
యెడము కలుగజేసియున్నాడు -
మన పాపములను - ఎడముగానే
చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ||

8. కొడుకులపై దండ్రి జాలి -
పడు విధముగా భక్తిపరుల =
యెడల జాలి పడును దేవుండు -
తన భక్తిపరుల - 
యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే ||దేవ||

9. మనము నిర్మితమయిన రీతి -
తనకు దెలిసియున్న సంగతి =
మనముమింవార మంచును -
జ్ఞాపకముచేసి - కొనుచు కఱుణ   
జూపుచుండును ఆ కారణముచే ||దేవ||

10. పూసి గాలి వీవ నెగిరి -
పోయి బసను దెలియని వన -
వాస పుష్పమువలెనె నరు డుండు -
నరు నాయువు తృణ -
ప్రాయము మన దేవ కృప మెండు -
ఆ కారణముచే ||దేవ||

11.పరమ దేవ నిబంధ నాజ్ఞల్‌ -
భక్తితో గైకొను జనులకు =
 నిరతమును గృప నిలిచి యుండును - యెహోవా నీతి -
తరముల పిల్లలకు నుండును -
ఆ కారణముచే ||దేవ||


SONG REQUEST

Name

Email *

Message *