"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: April 2019

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Mahonnatuda nee krupalo | TELUGU CHRISTIAN SONGS





మహోన్నతుడా నీ కృపలో 
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవితం ధన్యమైయున్నది
1.               మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు
మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు
2.               ఆకువాడక ఆత్మఫలములు – ఆనందముతో ఫలియించుటకై
జీవజలముల ఊటయైన నీవొరను నన్ను నాటితివా
3.               వాడబారిన స్వాస్థ్యము నాకై – పరమందు దాచియుంచితివా
వాగ్ధాన ఫలమును అనుభవింప – నీ కృపలో నన్ను పిలిచితివా

Aaradintumu yesuni | TELUGU CHRISTIAN SONGS





ఆరాధింతుము యేసుని ఆరాధింతుము
ఆరాధింతుము యేసుని ఆరాధింతుము
ఆత్మతోను సత్యముతోను ఆరాధింతుము – 2
1.               విశ్వాసముతో ఇప్పుడు తండ్రిని ఆరాధింతుము
ఎల్లప్పుడు యేసుని ఆరాధింతుము
2.               వ్యాధులు బాధలు తొలగి పోవును ఆరాధనయందు
మనస్సు మారి నూతన మొంది ప్రజ్వలింతుము
3.               సెరాపులు ఆరాధించు పరిశుద్దుని
దూత గణములు స్తుతియించు సర్వశక్తుని
4.               అపోస్తులు రాత్రియందు ఆరాధించిరి
సంకెళ్ళు ఊడి బందితులంత విడుదల పొందిరి
5.               కష్టం నష్టం నిష్టూరంబులు  సమసి పోవును
స్తుతి స్తోత్రం హల్లెలూయ గీతం  పాడుదాం
6.               హల్లెలుయ హల్లెలుయ గీతం పాడుదాం
హల్లెలుయ గీతం పాడి ఆరాధించుదాం

Prabhu prakaashamutho | TELUGU CHRISTIAN SONGS




ప్రభు ప్రకాశముతో – ప్రజ్వల మాయెను
ప్రభు ప్రకాశముతో – ప్రజ్వల మాయెను
ప్రపంచమా నేడు – మరణ విజయుడై
తిరిగి లేచే చూడు
1.               పరిశుద్ధ పావనుని – ఆరోహనం
మరణపు విజయోత్సవం – మరణము
నొంది – శక్తిగ లేచిన ||2||
గీతముల్ పాడరే – జయమనరే
2.               పరలోక దైవాజ్ఞ్య నెరవేర్చెను
మరణము తొలగింపను – నరులకు
మోక్షమార్గము – చూప – మరణమున్
గెలచిన క్రీస్తును కొల్వరే

Pancha Gaayamu | TELUGU CHRISTIAN SONGS






పంచ గాయము లొందగా
పంచ గాయము లొందగా
ప్రభు సిలువపై వ్రేలాడగా
పలికె అమృత వాక్కులే
ఈ ధరకు సందేశంబుగా
1.              తండ్రి వీరల మన్నించుము – వీరు చేయున దెరుగరు
ఆది దేవుని ఆజ్ఞ నెరవేర్చగ శ్రమల భరియించెగా – శ్రమల ఇల భరియించెగా పరమ శత్రువునైన ప్రీతిని – చేర్చి సంరక్షింపగా
కల్వరిన్ ప్రభు తెల్పెగా – పాటించుమా ఓ క్రెస్తవా
2.              నీవును నాతోడ నేడు – ఉందువు పరదైసునందు
ఘోరమగు పాపములు చేసిన – ఖలుని ప్రభు రక్షించెగా
నీదు పాపపు వస్త్రమున్ – ప్రభు  సన్నిధిన్ త్వజియించినా
నిత్య జీవ కిరీటమున్ – ధరియింప జేయును పరమున
3.              అమ్మ ఇదిగో నీ కుమారుడు – అని వచించెను యేసుడు
యిలను మాతా పితరులను – ప్రేమింపనేర్పి ఈ రీతిగా – ప్రేమించె ఈ రీతిగా నీదు తల్లి తండ్రిని – సత్కరించిన ప్రీతితో
దీర్ఘ ఆయువు నొసగి దేవుడు ఆశీర్వదించుగా
4.              దేవా నా దేవా నీవేల – నాదు చేయి విడితివి
శ్రమల బాధ అధికమాయె – తనువుపై గాయంబులాయె
మానవ పాపంబులకు – పరిహార మార్గము చూపగా
సిలువపై బలియైన దైవ – సుతుని విశ్వసించుమా
5.              దప్పిగొనుచున్నాను నేనని – దైవ సుతుడర్థించెను
దీనజన సంరక్షణార్థము – దాహమొందెను యేసుడు
దైవ సేవకు అంకితంబై – ప్రభువు దాహము తీర్తువా
ఇహమునే ప్రేమించి ప్రతిగా – చేదు చిరకందింతువా
6.              దైవ చిత్తము పూర్తి చేయుట – ధరణిలో సమాప్తమయ్యెను
ప్రవచనములు నిజము కాగా – ధరను చీకటి క్రమ్మెగా
జీవిత పోరాటమందున – చివరిదాకా నిలువుమా
దైవ సేవను అన్యులకు – సంపూర్ణముగ జరిగించుమా
7.              జనక నీ చేతికి నా ఆత్మను – అప్పగించుచుంటిని
సర్వదా కుడి పార్శ్వమందున – నిలిచియుండెద నేనికన్
తరతరములు సజీవుడేసు – మరణ భయమును తీర్చెగా
నీ నిరీక్షణలో సహాయము – నొసగి దేవుడు కాయగా


Sajeevudesuni Rakthamulo kadugabadina janama | TELUGU CHRISTIAN SONGS




సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా
సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా
సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా
యువజనమా యేసులో బలపడుమా
జడియకుమా యేసుకై పరుగిడుమా
సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా

జీవితకాలం స్వల్పం యవ్వనమేంతో శ్రేష్టం (2)
నీ యవ్వన బలం యేసుకై వాడిన జీవితమే ఫలమంతం (2)
యువజనమా యేసులో బలపడుమా
జడియకుమా యేసుకై పరుగిడుమా
సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా

ఆకర్శించే లోకం ఆశలనాషణ కూపం (2)
లోకాశలను జయుంచుచు సాగిన చేరెదవు పరలోకం (2)
యువజనమా యేసులో బలపడుమా
జడియకుమా యేసుకై పరుగిడుమా
సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా

దేవునితోటయే సంఘం పనిచేయుట నీ ధర్మం (2)
నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం (2)
యువజనమా యేసులో బలపడుమా
జడియకుమా యేసుకై పరుగిడుమా
సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా

Santhoshamuto Nichhedu Vaarini | TELUGU CHRISTIAN SONGS




సంతోషముతో నిచ్చెడు వారిని
సంతోషముతో నిచ్చెడు వారిని – నెంతో దేవుడు ప్రేమించున్ = వింతగ వలసిన – దంతయు నొసంగును – వినయ మనసుగల – విశ్వాసులకును
1.               అత్యాసక్తితో నధికప్రేమతో – నంధకార జను లందఱికి = సత్య సువార్తను – జాటించుటకై – నతతము – దిరిగెడు – సద్భుక్తులకు
2.               వేదవాక్యమును వేరు వేరు గ్రా – మాదుల నుండెడు బాలురకు = సాధులు ప్రభుని సు – బోధలు నేర్పెడి – సజ్జన క్రెస్తవోపాధ్యాయులకు
3.               దిక్కెవ్వరు లేకుండెడి దీనుల  - తక్కువ లన్నిటి దీర్చుటకై = నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు – ప్రక్కలలో బ్రక – టించుట కొఱకై
4.               ఇయ్యండీ మీ కీయం బడు నని – యియ్యంగల ప్రభు యే సనెను = ఇయ్యది మరువక – మదిని నుంచుకొని – యియ్యవలెను మన – యీవులనికను
5.               భక్తిగలిగి ప్రభు పని కిచ్చుట బహు – యుక్త మటంచు ను – దారతతో = శక్తికొలది మన భుక్తి నుండి యా – సక్తితో నిరతము – నియ్య వలెను

Ennadu Gancehdamo | TELUGU CHRISTIAN SONGS






ఎన్నడు గాంచెదమో
ఎన్నడు గాంచెదమో – యేసుని – నెన్నడు గాంచెదమో = యెన్నడు జూతుము – కన్నె కుమారుని – సన్నుతి జేయుచును
1.               అంధుల గాచె నట – యెహోవా – నందను డితడౌనట = పొందుగ బాపాత్ములకొర – కై తన – ప్రాణము విడిచెనట
2.               వేసిరి సిలువనట – క్రీస్తుని – జేసిరి హేళనట = దాసిరి యూదులట – బల్లెము – దూసిరి ప్రక్కనట
3.               చిందెను రక్తమట – పరమ – సంధులు దెల్పెనట = నిందల కోర్చె నట – మన దగు – నేరము గాచెనట
4.               ఆపద కోర్చెనట – పాపపు – మోపులు మోసెనట = కోపము మాన్పెనట – యెహోవా – కోడుకై వెలసెనట
5.               అక్షయు డితడెనట – జగతికి – రక్షకు డాయెనట = దీక్షగ నమ్మిన నరులం – దరికి ని – రీక్షణ దేవుడట

SONG REQUEST

Name

Email *

Message *