"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: June 2017

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

O maa tandri needu naamamu

ఓ మా తండ్రి నీదు నామము
ఓ మా తండ్రి నీదు నామము – నిత్య మెన్ను – చుండు గాక సకల లోకము= క్షేమముగను విమలముగను – జెన్ను మిరగ బరలోక – ధాముడవై వెలయునట్టి – ధన్య సౌజన్యమాన్య

1.    నీ రాజ్యంబు రా నిమ్ము - నీదు చిత్తము – నేటుగ బరలోకమందున = నే రీతిగను జేయబడునో – యీ భూలోకమందు నట్టి – దారి బొంద జేయవలెను – ధర్మ మూర్తి సత్యవర్తి

2.    నేటి యాహారంబు మాకు – గరుణజేసి – నేటి కిచ్చి సూటి పరచుమి – మేటి మా విరోధి జనుల – మే మేటుల క్షమింతు మటుల – మాటికిని క్షమింప నీవె – మాకు వేరె లేరు సుమ్ము


3. మమ్ము శోధనమునకు తేకుము – కీడునుండి – మరల జేయు మమ్ము నేమనన్ = ఇమ్మగు బల మహిమ రా – జ్యమ్ములును సర్వకా – లమ్ము నీవే మాదు ప్రార్ధ- న నమ్ము జేకొమ్ము ఆమేన్


PPT 📥


Devuni Stuthiinchudi yellapudu


"Love the Lord your God with all your heart and with all your soul and with all your mind."

Matthew 22:37


దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు
దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి        ||దేవుని||

యన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ… (2)      ||ఎల్లప్పుడు||

ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
ఆకశవిశాలమందు ఆ… (2)      ||ఎల్లప్పుడు||

ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
ఆయన ప్రభావమును ఆ… (2)  ||ఎల్లప్పుడు||

బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
స్వరమండలములతో ఆ… (2)   ||ఎల్లప్పుడు||

సన్న తంతుల సితారతోను (2)
చక్కని స్వరములతో ఆ… (2)    ||ఎల్లప్పుడు||

తంబురతోను నాట్యముతోను (2)
తంతి వాద్యములతో ఆ… (2)     ||ఎల్లప్పుడు||

పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
ఎల్లప్రజలు జేరి ఆ… (2)           ||ఎల్లప్పుడు||

మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
గంభీర తాళముతో ఆ (2)       ||ఎల్లప్పుడు||

సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
హల్లెలూయా ఆమెన్ ఆ (2)    ||ఎల్లప్పుడు||


Ravayya yesunadha ma rakshana marga

రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము


రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము
నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు

1. హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి
మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను

2. నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి
మా గండంబులన్నియు ఖండించుటకు 



3. మేర లేని పాపము  మాకు భారమైన మోపు 
 నీవు = దూరంబుగా
జేసి – దారి జూపుటకు
4. పాపుల మయ్యమేము పరమ తండ్రిని గానకను
మా పాపంబు లన్నియు పారద్రోలుటకు 

5. అందమైన నీదు పరమానంద పురమందు
మే మందరము జేరి యానందించుటకు

SONG REQUEST

Name

Email *

Message *