"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: December 2016

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Devaadi devudu mahopakaarudu

దేవాదిదేవుడు – మహోపకారుడు
దేవాదిదేవుడు – మహోపకారుడు
మహాత్యముగల మహారాజు
ప్రభువుల ప్రభువు – రాజుల రాజు
ఆయన కృప నిరంతరముండును
1.            సునాద వత్సరము – ఉత్సాహసునాదము
నూతన సహాస్రాబ్ది – నూతన శతాబ్దము
ఉత్తమదేవుని దానములు
2.            యుగములకు దేవుడవు – ఉన్నవాడవు అనువాడవు
జగమంత ఏలుచున్న  - జీవాధిపతి నీవే
నీదు క్రియలు ఘనమైనవి
3.            తంతి వాద్యములతో – తంబుర సితారతో
మ్రోగు తాళములతో – గంభీర ధ్వనులతో
సకల ప్రాణులు స్తుతించెదరు
4.            అద్వితీయ దేవుడవు – ప్రభువైన యేసుక్రీస్తు

మహిమ మహత్యములు – సర్వాధి పత్యమును సదా నీకె కలుగునుగాక


Kroththa Yedu Modalu Bettenu


క్రొత్త యేడు మొదలు బెట్టెను
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు
క్రొత్త యేడు మొదలు బెట్టెను
క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ
తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ

పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర
డెందమందు స్మరణ జేయుడి
ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయు
అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా

మేలు సేయ దడ వొనర్పగా – మీరెఱుగునట్లు – కాలమంత నిరుడు గడ చెగా = ప్రాలుమాలి యుండకుండ – జాల మేలు సేయవలయు – జాల జనముల కిమ్మాను – యేలు నామ ఘనతకొఱకు

బలము లేని వారమయ్యీను బలమొందవచ్చు
కలిమి మీర గర్త వాక్కున
అలయకుండా అడుగుచుండ నలగకుండా మోదమొంది
బలమొసంగు సర్వ విధుల నెలమి మీర నొచ్చుచుండ

ఇద్ధరిత్రి నుండు నప్పుడే – యీశ్వరుని జనులు – వృద్ధిబొంద జూడ వలయును = బుద్ధి నీతి శుద్ధలందు – వృద్ధినొంద శ్రద్ధ జేయ – శుద్ధు లైన వారిలో ప్ర – సిద్ధు లగుచు వెలుగ వచ్చు

పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు
ప్రాపు జేరి మీరు వేడగా
సేపు మీర తనదు కరుణ పాపమంతా కడిగివేసి
పాప రోగ చిహ్నలన్ని బాపి వేసి శుద్ది చేయు

Vandanambonarthumo


వందనంబొనర్తుమో ప్రభో
వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా
వందనంబు లందుకో ప్రభో  ||వందనం||

ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు
గన్న తండ్రి మించి ఎపుడు గాచియు
ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా
యన్ని రెట్లు స్తోత్రములివిగో   ||వందనం||

ప్రాత వత్సరంపు బాప మంతయు
బ్రీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా
దాత క్రీస్తు నాథ రక్షకా ||వందనం||

దేవ మాదు కాలుసేతు లెల్లను
సేవకాలి తనువు దినములన్నియు
నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ
సేవకై యంగీకరించుమా  ||వందనం||

కోతకొరకు దాసజనము నంపుము
ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము
ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వందనం||

మా సభలను పెద్దజేసి పెంచుము
నీ సువార్త జెప్ప శక్తి నీయుము
మోసపుచ్చు నందకార మంత ద్రోయుము
యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం||



Nadipistaadu naa devudu


"And the LORD shall guide thee continually, and satisfy thy soul in drought, and make fat thy bones: and thou shalt be like a watered garden, and like a spring of water, whose waters fail not."

Isaiah 58:11


నడిపిస్తాడు నా దేవుడు
నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడు
అడుగులు తడబడినా అలసట పైబడినా
చేయితట్టి వెన్నుతట్టి చక్కని ఆలోచన చెప్పి (2)


1. అంధకారమే దారి మూసినా నిందలే నను కృంగదీసినా
తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు

2. కష్టాల కొలిమి కాల్చివేసినా శోకాలు గుండెను చీల్చివేసినా
తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు


3. నాకున్న కలిమి కరిగిపోయిన నాకున్న బలిమి తరిగిపోయిన
తనచిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు


Download Lyrics as PPT


O Sadbhaktulaaraa

ఓ సద్భాక్తులారా లోక రక్షకుండు
ఓ సద్భాక్తులారా లోక రక్షకుండు
బెత్లేహేమందు నేడు జన్మించెన్
రాజాధి రాజు ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
సర్వేశ్వరుండు నర రూపమెత్తి
కన్యకు బుట్టి నేడు వేంచేసెన్
మానవ జన్మ మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము
ఓ దూతలారా ఉత్సాహించి పాడి
రక్షకుండైన యేసున్ స్తుతించుడి
పరాత్పరుండా నీకు స్తోత్రమంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ
ఈ వేల స్తోత్రము నర్పింతుము
అనాది వాక్య మాయే నర రూప
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో


Vinareyo narulaaraa

వినరే యో నరులారా

వినరే యో నరులారా – వీనుల కింపు మీర – మనల రక్షింప క్రీస్తు –
మనుజావతారుడయ్యో – వినరే = అనుదినమును దే – వుని తనయుని పద – వనజంబులు మన – మున నిడికొనుచును
1.              నరరూపు బూని ఘోర – నరకుల రారమ్మని – దురితము బాపు దొడ్డ –దొరయౌ మరియా వరపుత్రుడు = కర మరు దగు క – ల్వరి గిరి దరి కరి – గి రయంబున ప్రభు – కరుణను గనరే
2.              ఆనందమైన మోక్ష – మందరి కియ్య దీక్ష – బూని తనమేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెను = దీన దయా పరు – డైన మహాత్ముడు – జానుగ – యాగము నలిపిన తెరంగిది
3.              పొందు గోరిన వారి – విందా పరమోపకారి – యెందు రెందరి
బరమా – నందపద మొందగ జేసెను = అందమునన్ దన – బొంది సురక్తము – జిందెను భక్తుల – డెందము గుందగ
4.              ఇల మాయావాదుల మాని – యితడే సుద్గురు డని – తలపోసి చూచి మతి ని – శ్చల భక్తిని గొలిచిన వారికి = నిల జనులకు గలు – ములనలరెడు ధని – కుల కందని సుఖ – ములు మరి యేసగును

5.              దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి – నిరత మోక్షానందసుం – దర మందిరమున కరుదుగ జనె = బిరబిరి మన మం – దర మా కరుణా – శరనిధి చరణ మె – శరణని పోదము

Aakaashamandunna Aaseenudaa

ఆకాశమందున్న ఆసీనుడా
ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను        ||ఆకాశ||

దారి తప్పిన గొర్రెను నేను
దారి కానక తిరుగుచున్నాను (2)
కరుణించుమా యేసు కాపాడుమా        ||నీ తట్టు||

గాయపడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా (2)
కరుణించుమా యేసు కాపాడుమా        ||నీ తట్టు||

పాప ఊభిలో పడియున్నాను
లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
కరుణించుమా యేసు కాపాడుమా        ||నీ తట్టు||

Download Lyrics as PPT



Aakaasha Vaasulaaraa

ఆకాశ వాసులారా
ఆకాశ వాసులారా
యెహోవాను స్తుతియించుడి (2)
ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతియించుడి హల్లేలూయ (2)         ||ఆకాశ||

ఆయన దూతలారా మరియు
ఆయన సైన్యములారా (2)
సూర్య చంద్ర తారలారా
యెహోవాను స్తుతియించుడి హల్లేలూయ (2)         ||ఆకాశ||

సమస్త భుజనులారా మరియు
జనముల అధిపతులారా (2)
వృద్దులు బాలురు, యవ్వనులారా
యెహోవాను స్తుతియించుడి హల్లేలూయ (2)         ||ఆకాశ||


క్రీస్తుకు సాక్షులారా మరియు
రక్షణ సైనికులారా (2)
యేసు క్రీస్తు పావన నామం
ఘనముగ స్తుతియించుడి హల్లేలూయ (2)         ||ఆకాశ||

Andaala Udyaanavanamaa

అందాల ఉద్యానవనమా
అందాల ఉద్యానవనమా
ఓ క్రైస్తవ సంఘమా (2)
పుష్పించలేక ఫలియింపలేక (2)
మోడై మిగిలావ నీవు (2) ||అందాల||

ప్రభు ప్రేమలో బాగు చేసి
శ్రేష్టము ద్రాక్షాగ నాటాడుగా (2)
కాచావు నీవు కారు ద్రాక్షాలు (2)
యోచించు ఇది న్యాయమేనా (2)   ||అందాల||

ప్రభు యేసులో నీవు నిలచి
పరిశుద్ధాత్మతో నీవు పయనించుమా (2)
పెరిగావు నీవు ఫలియింపలేక (2)
యోచించు ఇది న్యాయమేనా (2)    ||అందాల||


ఆకలిగొని నీవైపు చూడ
ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)
ఇకనైన నీవు నిజమైన ఫలముల్ (2)
ప్రభు కొరకై ఫలియింపలేవా (2)   ||అందాల||

PPT 📥

Andaala Thaara

అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని              
||అందాల తార||

విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్        
||అందాల తార||

యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి
యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు      
||అందాల తార||

ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన           
||అందాల తార||

PPT 




Aparaadhini yesaiah


అపరాధిని యేసయ్యా
అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)

సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)

ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)

ముళ్ళతో కీరీటంబు
 నల్లి నీ శిరమున నిడితి
నా వల్ల నేరమాయె
 చల్లని దయగల తండ్రి

దాహంబు గొనగా చేదు
 చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితినీ
 దేహంబుగాయంబులను
 
ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)

చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)

శిక్షకు పాత్రుడనయ్యా
 రక్షణ దెచ్చితివయ్యా
అక్షయ భాగ్యము నియ్య
 మోక్షంబు జూపితివయ్యా




SONG REQUEST

Name

Email *

Message *