క్రొత్త
యేడు మొదలు బెట్టెను
క్రొత్త యేడు
మొదలు బెట్టెను మన బ్రతుకు నందు
క్రొత్త యేడు మొదలు బెట్టెను
క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ
తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ
క్రొత్త యేడు మొదలు బెట్టెను
క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ
తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ
పొందియున్న
మేలులన్నియు బొంకంబు మీర
డెందమందు స్మరణ జేయుడి
ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయు
అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా
డెందమందు స్మరణ జేయుడి
ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయు
అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా
మేలు సేయ దడ
వొనర్పగా – మీరెఱుగునట్లు – కాలమంత నిరుడు గడ చెగా = ప్రాలుమాలి యుండకుండ – జాల
మేలు సేయవలయు – జాల జనముల కిమ్మాను – యేలు నామ ఘనతకొఱకు
బలము లేని
వారమయ్యీను బలమొందవచ్చు
కలిమి మీర గర్త వాక్కున
అలయకుండా అడుగుచుండ నలగకుండా మోదమొంది
బలమొసంగు సర్వ విధుల నెలమి మీర నొచ్చుచుండ
కలిమి మీర గర్త వాక్కున
అలయకుండా అడుగుచుండ నలగకుండా మోదమొంది
బలమొసంగు సర్వ విధుల నెలమి మీర నొచ్చుచుండ
ఇద్ధరిత్రి నుండు
నప్పుడే – యీశ్వరుని జనులు – వృద్ధిబొంద జూడ వలయును = బుద్ధి నీతి శుద్ధలందు –
వృద్ధినొంద శ్రద్ధ జేయ – శుద్ధు లైన వారిలో ప్ర – సిద్ధు లగుచు వెలుగ వచ్చు
పాప
పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు
ప్రాపు జేరి మీరు వేడగా
సేపు మీర తనదు కరుణ పాపమంతా కడిగివేసి
పాప రోగ చిహ్నలన్ని బాపి వేసి శుద్ది చేయు
ప్రాపు జేరి మీరు వేడగా
సేపు మీర తనదు కరుణ పాపమంతా కడిగివేసి
పాప రోగ చిహ్నలన్ని బాపి వేసి శుద్ది చేయు
No comments:
Post a Comment