రండి ఉత్సాహించి పాడుదము
రండి ఉత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే ||2||
రండి కృతజ్ఞత స్తోత్రముతో
రారాజు సన్నిధికేగుదము ||2||
సత్ప్రభు నామము కీర్తనలన్
సంతోష గానము చేయుదము ||రండి||
మన ప్రభువే మహా దేవుండు
ఘన మహాత్యము గల రాజు ||2||
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరములాయనవే
||రండి||
సముద్రము సృష్టించెనాయనదే
సత్యుని హస్తమే భువిజేసెన్ ||2||
ఆయన దైవము పాలితుల
ఆయన మేపెడి గొర్రెలము
||రండి||
ఆ ప్రభు సన్నిధి మోకరించి
ఆయన ముందర మ్రొక్కుదము ||2||
ఆయన మాటలు గైకొనిన
అయ్యవి మనకెంతో మేలగును
||రండి||
తండ్రి కుమార శుద్దాత్మకును
తగు స్తుతి మహిమలు కల్గు
గాక ||2||
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ
అయినట్లు యుగములనౌను ఆమెన్
||రండి||
No comments:
Post a Comment