వినరే యో నరులారా
వినరే యో నరులారా – వీనుల
కింపు మీర – మనల రక్షింప క్రీస్తు –
మనుజావతారుడయ్యో – వినరే =
అనుదినమును దే – వుని తనయుని పద – వనజంబులు మన – మున నిడికొనుచును
1.
నరరూపు బూని ఘోర – నరకుల రారమ్మని – దురితము బాపు దొడ్డ –దొరయౌ
మరియా వరపుత్రుడు = కర మరు దగు క – ల్వరి గిరి దరి కరి – గి రయంబున ప్రభు – కరుణను
గనరే
2.
ఆనందమైన మోక్ష – మందరి కియ్య దీక్ష – బూని తనమేని సిలువ –
మ్రాను నణచి మృతి బొందెను = దీన దయా పరు – డైన మహాత్ముడు – జానుగ – యాగము నలిపిన
తెరంగిది
3.
పొందు గోరిన వారి – విందా పరమోపకారి – యెందు రెందరి
బరమా – నందపద మొందగ జేసెను = అందమునన్ దన – బొంది సురక్తము –
జిందెను భక్తుల – డెందము గుందగ
4.
ఇల మాయావాదుల మాని – యితడే సుద్గురు డని – తలపోసి చూచి మతి
ని – శ్చల భక్తిని గొలిచిన వారికి = నిల జనులకు గలు – ములనలరెడు ధని – కుల కందని
సుఖ – ములు మరి యేసగును
5.
దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి – నిరత మోక్షానందసుం
– దర మందిరమున కరుదుగ జనె = బిరబిరి మన మం – దర మా కరుణా – శరనిధి చరణ మె – శరణని పోదము
No comments:
Post a Comment