ఓ మా
తండ్రి నీదు నామము
ఓ మా తండ్రి నీదు నామము – నిత్య మెన్ను – చుండు
గాక సకల లోకము= క్షేమముగను విమలముగను – జెన్ను మిరగ బరలోక – ధాముడవై వెలయునట్టి –
ధన్య సౌజన్యమాన్య
1. నీ రాజ్యంబు రా నిమ్ము - నీదు చిత్తము – నేటుగ
బరలోకమందున = నే రీతిగను జేయబడునో – యీ భూలోకమందు నట్టి – దారి బొంద
జేయవలెను – ధర్మ మూర్తి సత్యవర్తి
2. నేటి యాహారంబు మాకు – గరుణజేసి – నేటి కిచ్చి సూటి
పరచుమి – మేటి మా విరోధి జనుల – మే మేటుల క్షమింతు మటుల – మాటికిని క్షమింప నీవె – మాకు వేరె
లేరు సుమ్ము
3. మమ్ము శోధనమునకు తేకుము –
కీడునుండి – మరల జేయు మమ్ము నేమనన్ = ఇమ్మగు బల మహిమ రా – జ్యమ్ములును సర్వకా –
లమ్ము నీవే మాదు ప్రార్ధ- న నమ్ము జేకొమ్ము ఆమేన్