సమానులెవరు ప్రభో – నీ - సమానులెవరు ప్రభో
సమానులెవరు ప్రభో – నీ - సమానులెవరు ప్రభో = సమస్త మానవ - శ్రమాను భవమున్ – సహించి వహించి – ప్రేమించగల నీ
1. సమాన తత్వము – సహోదరత్వము = సమంజసము గాను – మాకు దెలుప నీ
2. పరార్ధమై భవ – శరీర మొసగిన = పరోపకారా – నరావ తార
3. దయా హృదయ యీ – దురాత్ము లెల్లరిన్ = నయాన భయాన – దయాన బ్రోవ నీ
4. ఓ పావనత్ముడ – ఓ పుణ్య శీలుడ = పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుతునీ
No comments:
Post a Comment