కలుగునుగాక –
దేవునికి మహిమ
కలుగునుగాక – దేవునికి మహిమ – కలుగునుగాక = కలుగు నున్నతమైన – ఘన స్థలములందున –
నిలకు సమాధానం – నరుల కాయన దయ
1.
ప్రభువైన దేవా – పరమరాజా –
సర్వపరిపాలా = పరిపూర్ణ శక్తిగల – పరమ జనక నిన్ను – మహిమ స్తుతించుచు – మరి పొగడుచున్నాము
2.
మహిమపర్చుచు - ఆరాధించు – చున్నాము నిన్ను = మహిమాతిశయమును –
మది దలంచియు నీకు – మహిని మా స్తుతి కృత – జ్ఞత నిచ్చు చున్నాము
3.
ఏక కుమారా – యేసు ప్రభువా – యెహోవా తనయా = లోక పాపము మోయు –
ఏక దేవుని గొఱ్రె – పిల్ల మమ్మును కనిన – రించుము చల్లగ
4.
లోకపాపములు – మోయుచు బోవు – యేసు రక్షకా = వాసిగ జనకుని –
కుడివైపున గూర్చుండి – యేసూ మా ప్రార్ధన నా – లించి కనికరించు
5.
పరిశుద్ధుడవు – ప్రభుడవు నీవో – ప్రభువైన క్రీస్తూ = పరిశుద్ధాత్మతో
తండ్రి – యైన దేవునియందుబరిపూర్ణ మహిమతో -
బ్రబలుచున్నామవామేన్
No comments:
Post a Comment