సర్వదేశములారా –
శ్రీ యేసే దేవుండు
సర్వదేశములారా – శ్రీ యేసే
దేవుండు = ఉర్వి నుత్సాహముతో – గురుస్తోత్రము జేయను రండి
1.
ఆ ప్రభువే దేవుండు – అధికస్తోత్రార్హుండు = భూప్రజలు
నందరిని – బుట్టించిన భగవంతుండు
2.
మనము దేవుని వార – మను మరి యాయన ప్రజలు = మనయము నా
ఘనప్రభువు – నెనరుతో మేపెడి గొఱ్ఱెలము
3.
కృతజ్ఞతార్పణలు – కొల్లగను జెల్లింప = నాతని యావరణములో –
నతి వినయముతో జేరండి
4.
ఆయన దయామయుడు – ఆయన కృపామయుడు = ఆయన ప్రేమ సత్యం – బనవరతం
బుండును నిజమే
5.
శుభనామం మదినుంచి – ప్రభునామం స్తుతియించి = ఘననామం
బతిభక్తిన్ – అనయము గొలువుడి జనులారా
No comments:
Post a Comment