"I will send down Showers in season; there will be showers of blessing"
Ezekiel 34:26.
ఆశీరవంబు ల్మామీద
1. ఆశీరవంబు ల్మామీద
వర్షింపజేయు మీశ
యాశతో నమ్మి యున్నాము
నీసత్య వాగ్దత్తము
“ఇమ్మహి మీద
క్రుమ్మరించుము దేవ
క్రమ్మర ప్రేమ వర్షంబున్
గ్రుమ్మరించుము దేవా “
2. ఓ దేవ పంపింప వయ్యా
నీ దీవెన ధారలన్
మా దాహ మెల్లను బాపు
మాధుర్యమౌ వర్షమున్
3. మామీద కురియించు మీశ
ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద
క్షామంబు పోనట్లుగన్
4. ఈనాడె వర్షింపు మీశ
నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి
సన్నుతి బ్రార్థింతుము
No comments:
Post a Comment