ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన వినెడి
పావనుడా – ప్రార్థన మాకు నేర్పుమయా
1.
శ్రేష్టమైన
భావము గూర్చి – శిష్య బృందముకు నేర్పితివి = పరముడ నిన్ను – ప్రణుతించెదము – పరలోక
ప్రార్థన నేర్పుమయ్యా
2.
పరమ
దేవుడవని తెలసి – కరమ లెత్తి జంటగ మోడ్చి = శిరమునువంచి – సరిగను వేడిన – సుంకరి
ప్రార్థన నేర్పుమయా
3.
దినదినంబు
చేసిన సేవ – దైవ చిత్తముకు సరిపోవ = దీనుడవయ్యు – దిటముగ కొండను – చేసిన ప్రార్థన
నేర్పుమయా
4.
శత్రుమూక
నిను చుట్టుకొని – సిలువపైని నిను జంపగను = శాంతముతో నీ – శత్రుల బ్రోవగ – సలిపిన
ప్రార్థన నేర్పుమయా
No comments:
Post a Comment