నుతి సేయను లేవే – యో మనసా
నుతి సేయను లేవే –
యో మనసా – నుతి జేయను లేవే = క్షితిని దివిని – హితమతి బ్రోచెడి – సుతుని జనకుని –
శుద్ధాత్ముని ద్ర్యేకుని
1. సూర్యుని కాంతి – సొంపగు పంటలు – సుకాలక్షేమముల్
– శోభిలు గేహమున్ = ఆర్య సాంగత్యము – నైశ్వర్యముల నిల – ననుభవింపవె నీవా –
యాడ్యుని పేర్మిని
2. దురితము లందె – దుర్గతి నన్ను నీ – కురుతర
ప్రేమను – బరమార్ధ మీయను = వరపుత్రు నొసగడె – వందనీయుడు ప్రభు – మరిమరి మ్రోక్కుమా
– పరమోపకారిని
3. జీవము జ్ఞానము – జీవము నొసంగెడు – పావనాత్మను
నీకై – పంపిన దేవుడు = కేవల దోష స్వ – భావము మార్చడె – సేవ జేయుము నీవా –
పావనమూర్తికి
4. కరములు పదముల్ – కనకాదు లన్నియు – స్వరమును
చిత్తము – స్థిరమగు ప్రేమయు = మరి నీదు హృదయము – పరమాత్ము సేవకై – పరిపూర్ణముగ
నిచ్చి – ప్రణుతించు మాయనన్
No comments:
Post a Comment