అందాల తార అరుదెన్ఛె నాకై
పల్లవి: అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు – పయనమైతిమి ..
అందాల తార..
1. విశ్వాసయాత్ర - దూరమెంతైన
- విందుగా దోచెను
వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి
నొసగుచున్ .. అందాల తార..
2. యెరూషలేము - రాజనగరిలో -
ఏసును వెదకుచు
ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి
కడకు .. అందాల
తార..
3. ప్రభుజన్మస్ధలము -
పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె
ప్రార్ధన .. అందాల తార..
Andaala Tara Arudenche Nakai
Andaala Tara Arudenche Nakai - Ambara Veedhilo
Avataaramoorti Yesayya Keerti - Avani Chatuchun
Ananda Sandra Mupponge Naalo - Amara Kaantilo
Aadi Devuni Jooda Ashimpamanasu – Payanamaitimi
Visvaasa Yatra Dooramentaina - Vindugaa Dochenu
Vintaina Shanti Varshamche Naalo – Vijaya Padhamuna
Visvalanaeledi Devakumaruni - Veekshinchu Deekshalo
Virajimme Balamu Pravahinche Prema - Visranti Nosaguchun
Yerushalemu Rajanagarilo - Yesunu Vedakuchu
Erigina Daari Tolagina Vela - Yedalo Krungiti
Yesayya Tara Eppativole - Eduraye Trovalo
Ento Yabburapaduchu Vismayamonduchu - Egiti Svaami Kadaku
Prabhu Janma Sthalamu Pakayaegaani - Paraloka Saudhame
Baluni Jooda Jeevitamenta – Paavanamaayenu
Prabhu Padapooja Deevenakaga - Prasarinche Punyamu
Bratuke Mandiramaaye Arpanalae Sirulaye - Phaliyinche Prardhana
No comments:
Post a Comment