ఇంత కాలం నీదు కృపలో
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం||
ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని
తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం||
నీవు చేసిన మేలులు – తలచుకుందును
అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం||
No comments:
Post a Comment