మంచి పోరాటమును నేను పోరాడితిని
ప్రభువా
మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా (2)
విశ్వాసమును కాపాడుకొంటిని (2)
గురి చెంతకు గురి చెంతకు
పరుగెడుచున్నాను నేను పరుగెడుచున్నాను
మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా (2)
సుఖములలోన దుఖములోన నీ వాక్యమును మరువలేదు
ఆకలియైనను దాహమైనను నీ సన్నిధిని విడువలేదు (2)
జీవమైనను మరనమైనను (2)
నీవే అనుచు పాడుకుంటిని (2)
మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా (2)
జనులందరును పరిహసించిన నిను ప్రార్థించుట మానలేదు
బెదిరింపులకు జడియకుండా సత్య సువార్తను
చాటించితిని (2)
నా మటుకైతే బ్రతుకుట నీవని(2)
నీ వైపునకు చూచుచుంటిని (2)
మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా (2)
నిమిష నిమిషము విషమ పరీక్షలో ఎన్నెదురైన
క్రుంగలేదు
పొందబోము బహుమానముపై చూపునిలిపి పోరాడితిని (2)
నీతిమంతుడ న్యాయాదీసుడ (2)
గమ్యము చేర బలము నిమ్ము (2)
మంచి పోరాటమును నేను పోరాడితిని ప్రభువా (2)