నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా- నీవెంటే నేను ఉంటా యేసయ్యా
నీ మాట చాలయ్యా , నీ చూపు చాలయ్యా , నీ తోడు చాలయ్యా , నీ నీడ చాలయ్యా
1. ఎన్ని బాధలు ఉన్నను - ఇబ్బందులైనను
ఎంత కష్టము వచ్చినా , నిష్టురమైనను
" నీ మాట చాలయ్యా "
2. బ్రతుకు నావ పగలిన, కడలి పాలైనను
అలలు ముంచి లేపిన , ఆశలు అనగారిన
" నీ మాట చాలయ్యా "
3. ఆస్తులన్నీ పోయినా, ఆనాదిగా మిగిలిననూ
ఆప్తులే విడనాడినా , ఆరోగ్యం క్షీణించినా
" నీ మాట చాలయ్యా "
4. నీకు ఇలలో ఎదియూ లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు లేదు సమానము
" నీ మాట చాలయ్యా "
No comments:
Post a Comment