నిత్య ప్రేమతో
నన్ను ప్రేమించెన్
నిత్య ప్రేమతో నన్ను
ప్రేమించెన్ ||2||
తల్లి ప్రేమను మించినది
లోక ప్రేమను మించినది
నిన్ను నేను ఎన్నడు విడువను
||2||
నిత్యము నీతోనే జీవింతున్
సత్య సాక్షిగా జీవింతున్
నిత్య రక్షణతో నన్ను
రక్షించెన్ ||2||
ఏక రక్షకుడు యేసే
లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై ||2||
నీ పోలికగా ఉండుటకై ||2||
నా సర్వము నీకే అర్పింతున్
పూ-ర్ణానందముతో నీకే
అర్పింతున్
నిత్య రాజ్యములో నన్ను
చేర్పించేన్ ||2||
మేఘ రధములపై రానైయున్నాడు
యేసు రాజుగా రానైయున్నాడు
ఆరాధింతుము సాష్టాంగపడి ||2||
స్వర్గ రాజ్యములో యేసున్
సత్య దైవము యేసున్
No comments:
Post a Comment