క్రీస్తే సర్వాధికారి
క్రీస్తే సర్వాధికారి -
క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి -
1. ముక్తి విధాతనేత -
శక్తి నొసంగుదాత
భక్తి విలాపశ్రోత -
పరమంబు వీడె గాన ||క్రీస్తే||
2. దివ్య పథంబురోసి -
దైవంబు తోడుబాసి
దాసుని రూపుదాల్చి -
ధరణి కేతెంచెగాన ||క్రీస్తే||
3. శాశ్వత లోకవాసి -
సత్యామృతంపురాశి
శాప భారంబు మోసి -
శ్రమల సహించెగాన ||క్రీస్తే||
4. సైతాను జనము గూల్పన్ –
పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంప -
రుథిరంబు గార్చెగాన
5. మృత్యువు ముల్లు తృంపన్ –
నిత్యజీవంబు బెంపన్
మర్త్యాళిభయము దీర్పన్ –
మరణంబు గెలిచెగాన
6. పరమందు దివిజులైన -
ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు –
ప్రభునే భజించు గాన
7. ఈ నామమునకు మించు -
నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ -
హెచ్చించినాడు గాన ||క్రీస్తే||
No comments:
Post a Comment