సీయోనుకన్యా - సంభ్రమపడుచు
సీయోనుకన్యా - సంభ్రమపడుచు
- వేయుము కేకల్
పాయక నీ రాజు - భారవాహక మెక్కి -
బాలస్తోత్రములతో - బైలుదేరి వచ్చె ||సీయోను||
1)
హెబ్రాయిలోను - నీ రాజు పేరు - యూదులరాజే = హెబ్రీయ
జను లను - ఆబ్రాము కొడుకులను -
విభవదేశము జేర్చు - శుభరాజు యీతండే ||సీయోను||
2)
హెల్లేనీలోను - నీ రాజుపేరు - యూదులరాజే = యెల్లపాపుల
బ్రోచు - తాల్మిరక్షకుడితడు - చల్లని
ప్రభువని - గొల్లొత మ్రోగెను ||సీయోను||
3)
ఉర్వి రోమాలో - నీరాజుపేరు - యూదులరాజే = సర్వరాష్ట్రికులకు
-బూర్వపితరులతోను -
వరసింహాసన మిచ్చు - వరదేశాధిపు డితడు ||సీయోను||
4)
వాసిగ హెబ్రీ - హెల్లేనీలో రోమాయిలోను = హోసన్నా హోసన్నా - ప్రభుని పేరట
వచ్చు - మెస్సీయ్యదావీదు - కొడుకా శ్రీ శుభములు ||సీయోను||
No comments:
Post a Comment