దేవా దివ్యానంత ప్రభావ
దేవా దివ్యానంత ప్రభావ – మాంపాహి ఘన యెహోవా = స్థావర జంగమ – సహిత నిఖిల జగ – దావన పావన – భావ నిరంతర
1. సార – కారుణ్యపారా – వారా – సర్వజ్ఞ నిర్వి – కారా – యేసు నామావ – తారా – దీన జనోప – కారా = ఘోరమైన సం – సారటవి బడి – దారి గనని నను – జేరబిలిచితివి
2. అక్షీ – ణ విభవానంద – మోక్ష – రాజ్య మహిమా – ధ్యక్ష – సంతత సుజన రక్షా – కపట దుర్మనుజ – శిక్షా = పక్ష విపక్ష వి – లక్షణ రహిత క – టాక్షము నాదెస – దీక్షను నిలుపవె
3. సుంద – రాశ్చర్య గుణ – బృందా – బంధుర నిత్యా – నందా – సాధు సజ్జన వంద్యా – ఖండిత కలుష బృందా = మంద మతిని నా – డెందము కడు దెలి – వొంద జేసి నీ – యందు నిలుప గదె
4. నీవు – నన్ను సృష్టించి – నావు – నా గురురాదేవుడవు - క్రీస్తు యేసుని – చావు – వలన నన్మనిపి – నావు = పావన జనక సు – తాత్మలతోడను గేవల మొక్కడ – వై వెలిగెడి ప్రభు
5. ప్రేమ స్వరూప నిత్య – క్షేమ – పతతి పావన – నామ - దాస లోకాబ్ధి – సోమ సర్వేశ పరమ – ధామ = నేమ మెఱుంగని – నీచుడ నధముడ – నోమహాత్మ దయ – తో మన్నింపవె
No comments:
Post a Comment