యేసు నాయకుడ - యెల్ల
వేళలను
యేసు నాయకుడ - యెల్ల వేళలను
నీ – దాసుల నేలుమయ్యా = మోసము లన్నిటి –
మునగద్రోతునని – బాసుల జేసిన – ప్రభుడవు నీవెగా
1.
రేయింబవలు మా – న్యాయము చెరిపెడి – మాయ పిశాచిని = త్రోయుమి
దూరము – బాయక భక్తుల – చేయి విడువని బహుశ్రేష్టుడ నీవెగా
2.
హృదయము లోకము - మది
పాపము మమ్ము – సతతము శ్రమ పెట్టును = సదయుడ మమ్మును – వదలక నిత్యము – మది తలపులలో –
మహిమగ నేలుమీ
3.
కాపాడుమి మమ్ము – మాపు రేపు నీ – శ్రీ పాదము లోద్దను = ఏ
పాపములను ఎలకుండగ నీ – ప్రాపునబెంచుము – మాపాలకుడవో
4.
మా కొరకై నీ – మేనును మ్రానున – మేకులతో గోట్టగ – మానము
మహిమలు – మనుజుల కియ్యను – భానుడ రాజుగ – బ్రతికిలేచితివి
5.
చెఱను చెఱనుగా – మరి పట్టుక నీవు – పరమున కరిగితివే – వరముల
నిడితివి – ధరలో నరులకు – పరముడ నీ దయ మరువశక్యమా
No comments:
Post a Comment