జయప్రభు
యేసునె వెంబడించుచు
జయప్రభు యేసునె వెంబడించుచు – జయముగ నడచెదము – యేసుతో జయముగ
వెడలెదము = ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని – పయనము జేసెద మా ప్రభు వెంబడి
1.
ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును – అవనిలో రక్షయును = ఆదర్శంబౌ ఆయన వాక్యమే –
అనిశము మనకిల మార్గము చూపగ
2.
ధర విరోధులు మమ్ము జుట్టగ – దరి జేరెద మేసున్ – ప్రభుని దరిజేరెద మేము =
ధాత్రి దురాశల డుంబములన్నిటి – మైత్రిని వీడి నడచెద మేసుతో
3.
మా ప్రభు జూముము నీదు మార్గపు – మాదిరి జాడలను – నీ దగు = మాదిరి జాడలను = మా
పాదములను తొట్రిలకుండగ – మా కిడు బలమును యీ క్రుపాదినమున
4.
మా కొరకై నీవు నడచిన – మార్గము జూడగను – మేము మార్గము జూడగను = మా రక్షక నీ
అడుగుజాడలు – మరువక విడువక నడువగ కృపనిడు
5.
ఇహపరముల నినుగాక ప్రేమతో – ఎవరిని గొలిచెదము ? – ఎవరిని ప్రేమింప వశమె ? = విహరించెదము
యేసుని వెంబడి – మహిమ రాజ్యమున యేసుని గొలువగ
No comments:
Post a Comment