ప్రబలముగనే – ప్రస్తుతించెద – ప్రభుని కృపలన్ని
ప్రబలముగనే – ప్రస్తుతించెద – ప్రభుని కృపలన్ని = ప్రతి దినము నిను – ప్రచురపరచెద – ప్రభుడ నావిభుడా
1. పొందుగోరి నా – యందు నిలచిన – బంధుమిత్రుడవు = మందమతి కా – నందమొసగిన – మహిమతేజుడవు
2. చింతదీర్చి నా - భ్రాంతి మార్చితి – వెంత వింతదియో = స్వాంతమునకడు – శాంతిగూర్చితి - వెంత కరునదియో
3. నీతి కరపిని – జాతి మరపిన – ఖ్యాతి యేసునిదే = నీరసుడ నను – గారవించిన నీతిరాజితడే
4. జీవమిచ్చిన – జావవచ్చిన – దేవసుత నీవే = జీవదాయక – బ్రోవరాయిక – జాలమేలనురా
5. నిమిషనిమిషము – నిను భజించెద – నెమ్మనంబునను = శమదమాది – సుగుణశోభిత – సమ్మదిని నిమ్మా
No comments:
Post a Comment