ఆనంద మగు ముక్తి –
యే నా మందిరము
ఆనంద మగు ముక్తి – యే నా
మందిరము = జ్ఞాని మానుగ జూచు – దాని సుందరము
1.
పరదేశివలె దేహా – వరణమం దుందున్ – ధరణి కాననముగా – దర్శించు
చుందున్ – నెరి దుఃఖసుఖములు – సరిగా భావింతున్ = పరిశుద్ధాత్ముని వేడి – పరితృప్తి
నుండు
2.
బహు శోధనలు నాపై – బడి వచ్చునపుడు – నహితాంధతమము న –
న్నడ్డుకొన్నపుడు – నిహబాధ లన్నిన – న్నెదిరించినపుడు = నహహ యేసునివల్ల – నమృతుడ
నెపుడు
3.
ముందు నా మనసు దే – వుని కప్పగింతు – నందరి సస్మత్తు –
ల్యముగా ప్రేమింతున్ – సందేహ రాహిత్య – సరణిలో నిల్తు = పొంద బోయెడి ముక్తి – భువి
యందె గాంతు
No comments:
Post a Comment