సాక్ష్య మిచ్చెద –
మన స్వామి యేసు దేవు డంచు
సాక్ష్య మిచ్చెద – మన
స్వామి యేసు దేవు డంచు = సాక్ష్య మనగ గనిన వినిన – సంగతులను దెల్పుటయే – సాక్ష్య
మిచ్చు కొఱకు నన్ను స్వామి రక్షించె నంచు
1.
దిక్కు దెసయు లేని నన్ను – దేవుడెంతో కనికరించి = మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినాడో
2.
పల్లెటూళ్ళ జనుల రక్షణ – భారము నాపైని గలదు – పిల్లలకును
బెద్దలకును – బ్రేమతో నా స్వానుభవము
3.
బోధ చేయలేను వాద – ములకు బోను నాక దేల = నాధు డేసు ప్రభుని గూర్చి – నాకు దెలిసినంత
వరకు
4.
పాపులకును మిత్రు డంచు – బ్రాణ మొసగి లేచె నంచు = బావముల
క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు
5.
చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన = ఘోరపాపు లైన
క్రీస్తు – కూర్మితో రక్షించు నంచు
6.
పరమత దూషణము లేల –
పరిహసించి పలుకు టేల = ఇరుగు పొరుగు వారి కెల్ల – యేసు క్రీస్తు దేవు డంచు
7.
ఎల్లకాల మూరకుండ – నేల యాత్మ శాంతి లేక = తల్లడిల్లు
వారలకును – తండ్రి కుమా రాత్మ పేర
No comments:
Post a Comment