యేసువ జయముతో – యేరుషలేమున
యేసువ జయముతో – యేరుషలేమున – బ్ర – వేశము జేసిన యో ప్రభువా = వాసిగ బొగడగ –
వసుధను జనులు – విజయము జేసిన యో ప్రభువా
1.
మట్టలు బట్టియు – బట్టలు బరచియు – గట్టిగ బాడగ యో ప్రభువా =
అట్టహాసముతో – అశ్వము నెక్కడ – అణకువ గార్దభ మెక్కిన ప్రభువా
2.
పిల్లలు పెద్దలు – పలుకేకలతో – బలికి నుతించగ యో ప్రభువా =
చల్లగ వానిని – సరియని యొప్పి – సంతోషించిన యో ప్రభువా
3.
కొందరు వారిని – తొందర జేయగ – కూర్మిని దిద్దిన యో ప్రభువా
= అందరు మానిన – అరచును రాళ్లని – అతని నిచ్చిన యో ప్రభువా
4.
యేరుషలేం కొరకై – యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా =
యేరుషలేమందున – యాలయ మంతను – శుభ్రపరచి యో ప్రభువా
5.
మా కొఱకై తన – ప్రాణము బెట్టిన – మాన్యుడవీవె యో ప్రభువా =
మా
కొరకై ధర – మరణము గెల్చిన – మహిమ స్వరూపుడ యో ప్రభువా
6.
మాదు మనస్సుతో – హృదయము నాత్మను – నీదిగ గైకొని మో ప్రభువా
= సాదర వాక్కులు – చక్కగ బలికియు – నాదరించుమము నో ప్రభువా
No comments:
Post a Comment