ఆనంద సంద్రంబునా
– నీ జీవిత నావను
ఆనంద సంద్రంబునా –
నీ జీవిత నావను
నడిపేది ఆ యేసుడే –
దరిచేర్చి ఆ దేవుడే
1.
పెనుగాలులే వీచినా –
తుఫానులే తరిమినా
రక్షించి కాపాడి – ప్రభు అండ నీకుండ
దిగులేల ఓ సోదరా – నిశ్చింతగా సాగుమా
2.
ఆపత్కాలమునందునా – రోదించి
ప్రార్ధించినా
జవాబేమి లేదని – దూషింపబోకుమా
ప్రభు చిత్తమనే గిన్నెనే – సంతోషముగా త్రాగుమా
3.
ఏవైపు నీ మార్గము – ఏవైపు
నీ గమ్యమూ
ప్రభు సన్నిధిని వీడి – పయనింప చూచి
మత్స్యంబు గర్భంబునా – నివసింప గోరేదవా
No comments:
Post a Comment