పదములు చాలని
ప్రేమ ఇది
పదములు చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది
కరములు చాపి నిను కౌగలించి పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
ప్రేమా ఇది యేసుప్రేమ
ప్రేమా ఇది తండ్రిప్రేమ
ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కలువరి ప్రేమ
1.
నవమాసముల్ మోసి – ప్రయోజకులను చేసిన
కన్నబిడ్డలే నిన్ను వెలివేసినా
తన కరములు చాపి – ముదిమివచ్చువరకు
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
ఆ వేదనంత తొలగించెడి ప్రేమ
2.
మేలులెన్నో పొంది – ఉన్నత స్థితికెదిగిన
స్నేహితులే హృదయమును గాయపరచగా
మేలులతో నింపి అద్భుతములు చేసి
క్షమియించుట నేర్పించెడి ప్రేమా
శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమా
No comments:
Post a Comment