The LORD is my rock, my fortress and my deliverer; my God is my rock, in whom I take refuge, my shield and the horn of my salvation, my stronghold
Psalms 18:2
నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా
నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా
నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా
యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును
నా దేహమే యాగముగా అర్పించిన చాలునా
||నా జీవిత||
నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా
యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును
నా దేహమే యాగముగా అర్పించిన చాలునా
||నా జీవిత||
నా బాల్యమంతా నా తోడుగ నిలిచి
ప్రతి కీడు నుండి తప్పించినావు
యవ్వనకాలమున నే త్రోవ తొలగిన
మన్నించి నాతోనే కొనసాగినావు
ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో
నను దైర్యపరిచి నను ఆదుకున్నావు
యేసు నీవే నీవే యేసు… నీవే నా సర్వస్వమూ
||నా జీవిత||
||నా జీవిత||
కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే
సంతోష ఉదయాలు నాకిచ్చినావు
హృదయాశలన్ని నెరవేర్చినావు
యోగ్యుడను కాకున్న హెచ్చించినావు
ఎంతో ప్రేమ మితిలేని కృపను
నాపై చూపించి నను హత్తుకున్నావు
యేసు నీవే నీవే యేసు… నీవే నా ఆనందమూ
||నా జీవిత||
||నా జీవిత||
No comments:
Post a Comment