ఈయనా యేసు రక్షకుడు – తన – దాయమని
రక్షింప
ఈయనా యేసు రక్షకుడు
– తన – దాయమని రక్షింప – దలచెనా నన్ను – నీయనా యేసు రక్షకుడు = ఆయాసమగు నొక్క మోపు
– నే – మోయలేకుండ నా – మూపుపై నుండ – శ్రేయ: కరపు సిలువ జూపి – నాకు హాయి నిచ్చెను
భార – మంత వెడలించి
1.
దురితాత్ముడని
త్రోయకుండ నన్ను – బరిశుద్ధుడా యేసు – ప్రభుడు కరుణింప =
ధరణిలో నిది మహాద్భుతము – నే – మరుతునా యీ ప్రేమ – మరణమౌ దాక
2.
ఓపగూడని
దుష్కృతంబుల్ – నేను – తేపతేపకుజేసి – ద్వేషినై యుండ = గోప మింతైన రానీక – నన్ను –
గాపురుషుడని తానూ – ఖండింపడాయె
3.
మనస్తమో
గుణము లెడబాపెన్ – నా – దినకరోదయ మట్లు – దీప్తిమది మించెన్ = తన పాదములు జాడ
లబ్బెన్ – సదా – వినుతి కెక్కిన వాని విమలాత్మ వెలుగు
4.
హతు
డయ్యె నాయేసు నాకై – దు – ర్గతి తొలగి నాకు మో – క్షమే గల్గు కొఱకు = అతి
దయాదీర్ఘశాంతుండే – దైవ – సుతుడని యెఱిగితి – శోధింపగాను
5.
దీవింపదగు
నతని సిలువ – నా – జీవాంతమగు దనుక – చెలగి మోయుచును = ఈ వసుంధర జనుల కెల్ల మీరు –
సేవించు డేసునని – చెప్పి చాటుదును
No comments:
Post a Comment