ఆ..ఆ..ఆ.. పాటలు పాడుదము
ఆ..ఆ..ఆ.. పాటలు పాడుదుము – ఆ..ఆ..ఆ.. నాట్యము
చేయుదము
ప్రజలందరికి – ప్రభువుద్భవించెను – పండుగ
చేయుదుము ||2||
1. కాలము సంపూర్ణమాయెను – లేఖనములు నెరవేరెను
కన్యమరియ గర్భమున – క్రీస్తు యేసు జన్మించెను
2. సర్వోన్నతుని కుమారుడు – సమాధానమున కధిపతియు
సర్వజనుల రక్షకుడు – సతతము స్తోత్రార్హుడు
3. ఈయనే ఇమ్మానుయేలు – ఆయనే ప్రభువగు క్రీస్తు
నిత్యజీవ ప్రదాత – నిరతము పూజార్హుడు