ఎన్నడు గాంచెదమో
ఎన్నడు గాంచెదమో –
యేసుని – నెన్నడు గాంచెదమో = యెన్నడు జూతుము – కన్నె కుమారుని – సన్నుతి జేయుచును
1.
అంధుల
గాచె నట – యెహోవా – నందను డితడౌనట = పొందుగ బాపాత్ములకొర – కై తన – ప్రాణము విడిచెనట
2.
వేసిరి
సిలువనట – క్రీస్తుని – జేసిరి హేళనట = దాసిరి యూదులట – బల్లెము – దూసిరి ప్రక్కనట
3.
చిందెను
రక్తమట – పరమ – సంధులు దెల్పెనట = నిందల కోర్చె నట – మన దగు – నేరము గాచెనట
4.
ఆపద కోర్చెనట
– పాపపు – మోపులు మోసెనట = కోపము మాన్పెనట – యెహోవా – కోడుకై వెలసెనట
5.
అక్షయు
డితడెనట – జగతికి – రక్షకు డాయెనట = దీక్షగ నమ్మిన నరులం – దరికి ని – రీక్షణ
దేవుడట