సంతోషముతో నిచ్చెడు వారిని
సంతోషముతో నిచ్చెడు
వారిని – నెంతో దేవుడు ప్రేమించున్ = వింతగ వలసిన – దంతయు నొసంగును – వినయ మనసుగల –
విశ్వాసులకును
1.
అత్యాసక్తితో
నధికప్రేమతో – నంధకార జను లందఱికి = సత్య సువార్తను – జాటించుటకై – నతతము –
దిరిగెడు – సద్భుక్తులకు
2.
వేదవాక్యమును
వేరు వేరు గ్రా – మాదుల నుండెడు బాలురకు = సాధులు ప్రభుని సు – బోధలు నేర్పెడి –
సజ్జన క్రెస్తవోపాధ్యాయులకు
3.
దిక్కెవ్వరు
లేకుండెడి దీనుల - తక్కువ లన్నిటి దీర్చుటకై
= నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు – ప్రక్కలలో బ్రక – టించుట కొఱకై
4.
ఇయ్యండీ
మీ కీయం బడు నని – యియ్యంగల ప్రభు యే సనెను = ఇయ్యది మరువక – మదిని నుంచుకొని –
యియ్యవలెను మన – యీవులనికను
5.
భక్తిగలిగి
ప్రభు పని కిచ్చుట బహు – యుక్త మటంచు ను – దారతతో = శక్తికొలది మన భుక్తి నుండి యా
– సక్తితో నిరతము – నియ్య వలెను