పంచ గాయము లొందగా
పంచ గాయము లొందగా
ప్రభు సిలువపై వ్రేలాడగా
పలికె అమృత వాక్కులే
ఈ ధరకు సందేశంబుగా
1.
తండ్రి వీరల మన్నించుము – వీరు చేయున దెరుగరు
ఆది
దేవుని ఆజ్ఞ నెరవేర్చగ శ్రమల భరియించెగా – శ్రమల ఇల భరియించెగా పరమ శత్రువునైన
ప్రీతిని – చేర్చి సంరక్షింపగా
కల్వరిన్
ప్రభు తెల్పెగా – పాటించుమా ఓ క్రెస్తవా
2.
నీవును నాతోడ నేడు – ఉందువు పరదైసునందు
ఘోరమగు
పాపములు చేసిన – ఖలుని ప్రభు రక్షించెగా
నీదు
పాపపు వస్త్రమున్ – ప్రభు సన్నిధిన్
త్వజియించినా
నిత్య
జీవ కిరీటమున్ – ధరియింప జేయును పరమున
3.
అమ్మ ఇదిగో నీ కుమారుడు – అని వచించెను యేసుడు
యిలను
మాతా పితరులను – ప్రేమింపనేర్పి ఈ రీతిగా – ప్రేమించె ఈ రీతిగా నీదు తల్లి
తండ్రిని – సత్కరించిన ప్రీతితో
దీర్ఘ ఆయువు
నొసగి దేవుడు ఆశీర్వదించుగా
4.
దేవా నా దేవా నీవేల – నాదు చేయి విడితివి
శ్రమల బాధ అధికమాయె – తనువుపై గాయంబులాయె
మానవ పాపంబులకు – పరిహార మార్గము చూపగా
సిలువపై బలియైన దైవ – సుతుని విశ్వసించుమా
5.
దప్పిగొనుచున్నాను నేనని – దైవ సుతుడర్థించెను
దీనజన సంరక్షణార్థము – దాహమొందెను యేసుడు
దైవ సేవకు అంకితంబై – ప్రభువు దాహము తీర్తువా
ఇహమునే ప్రేమించి ప్రతిగా – చేదు చిరకందింతువా
6.
దైవ చిత్తము పూర్తి చేయుట – ధరణిలో సమాప్తమయ్యెను
ప్రవచనములు నిజము కాగా – ధరను చీకటి క్రమ్మెగా
జీవిత పోరాటమందున – చివరిదాకా నిలువుమా
దైవ సేవను అన్యులకు – సంపూర్ణముగ జరిగించుమా
7.
జనక నీ చేతికి నా ఆత్మను – అప్పగించుచుంటిని
సర్వదా కుడి పార్శ్వమందున – నిలిచియుండెద నేనికన్
తరతరములు సజీవుడేసు – మరణ భయమును తీర్చెగా
నీ నిరీక్షణలో సహాయము – నొసగి దేవుడు కాయగా