దేవా నా జీవితమిదిగో నీ సొంతం
పాతనిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం
క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవయాగం – ఇది శరీర యాగం
దేవా నా జీవితమిదిగో నీ సొంతం – ప్రతిక్షణం నీ పనికై అర్పితం (2)
నా వరకైతే బ్రతుకుట నీకోసం – చావైతే ఎంతో గొప్ప లాభం (2)
నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం
దేవా నా జీవితమిదిగో నీ సొంతం – ప్రతిక్షణం నీ పనికై అర్పితం
నా కరములు నా పదములు నీ పనిలో – అరిగినలిగి పోవాలి ఇలలో
సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో – అలసిసొలసి పొవాలి నాలో
నా కరములు నా పదములు నీ పనిలో – అరిగినలిగి పోవాలి ఇలలో
సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో – అలసిసొలసి పొవాలి నాలో
“ నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం(2)
దేవా నా జీవితమిదిగో నీ సొంతం – ప్రతిక్షణం నీ పనికై అర్పితం (2) ”
నా కాలము అనుకూలము నీ చిత్తముకై – ధనము ఘనము సమస్తము నీ పనికై
నా మరణము నీ చరణముల చెంతకై – నిన్ను మహిమపరచి నేలకోరుగుటకై
నా కాలము అనుకూలము నీ చిత్తముకై – ధనము ఘనము సమస్తము నీ పనికై
నా మరణము నీ చరణముల చెంతకై – నిన్ను మహిమపరచి నేలకోరుగుటకై
నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం
నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం
1 comment:
Wonderful song. Thank you in the name of Jesus Christ.
Post a Comment