ఎడబాయని నీ కృప
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ (2)
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని||
శోకపు లోయలలో – కష్టాల
కడగండ్లలో
కడలేని కడలిలో – నిరాశ
నిసృహలో (2)
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ (2)
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని||
విశ్వాస పోరాటంలో – ఎదురాయె
శోధనలు
లోకాశల అలజడిలో – సడలితి
విశ్వాసములో (2)
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని||
నీ సేవలో ఎదురైన – ఎన్నో
సమస్యలలో
నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగ (2)
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||
No comments:
Post a Comment