కన్నుల నిండుగ -
క్రిస్మస్ పండుగ
పల్లవి : కన్నుల నిండుగ - క్రిస్మస్ పండుగ
గుండెల నిండుగ - ఆనంద
ముండుగ 2
పరమ పురినుండే - పరిశుద్ధ దేవుడు
పుడమిలో పుట్టెగా
- పాపుల బ్రోవగ
మహిమలోనుండే -
మహిమాత్ముండు
మనుజుడాయెగా - మరణము
నొందగా
అప: రండి చేరి కొలిచెదం - రారండి కలసి పాడుదాం
రండి యేసుననుసరించుదాం -
పదండి ప్రభుని చూపించుదాం
చరణం1 :సర్వసృష్టిని
మాటతో చేసిన - సార్వభౌముడా నీకు సముడెవరయ్య
లోకపాపమంతయు మోయవచ్చిన -
దైవమానవా నీకు స్థలమే లేదయ్యా
చీకటినుండి వెలుగునకు -
మరణమునుండి జీవముకు 2
నడిపింపవచ్చిన నజరేయుని -
దాటింపవచ్చిన దయామయుని
ప్రేమించివచ్చిన
ప్రేమామయుని - క్షమియించవచ్చిన క్షమాపూర్ణుని
రండి చేరి కొలిచెదం -
రారండి కలసి పాడుదాం
రండి యేసుననుసరించుదాం -
పదండి ప్రభుని చూపించుదాం |కన్నుల|
చరణం2: విశ్వమంతయు వ్యాపించియున్న - సర్వవ్యాపి నీవులేని చోటే లేదయ్యా
అంతరంగమంతయు ఎరిగియున్న -
సర్వజ్ఞాని నీకు సాటే లేరయ్యా
దాస్యము నుండి
స్వాతంత్ర్యమును - శాపము నుండి విడుదలను 2
ప్రకటింప వచ్చిన
పుణ్యాత్ముని - రక్షింప వచ్చిన రక్షకుని
శాంతిచేయ వచ్చిన
శాంతమూర్తిని - విడిపింప వచ్చిన విమోచకుని
రండి చేరి కొలిచెదం -
రారండి కలసి పాడుదాం
రండి యేసుననుసరించుదాం -
పదండి ప్రభుని చూపించుదాం |కన్నుల|
చరణం3:
ఊహకందని త్రియేకమైయున్న -
అద్వితీయుడా నీవే ఆత్మరూపివయ్యా
నిన్న నేడు రేపు
ఏకరీతిగున్న - నిత్యనివాసి నీకు అంతమే
లేదయ్యా
సంకెళ్ళనుండి సంబరానికి
- ఉగ్రతనుండి ఉదాత్తతకు 2
తప్పింప వచ్చిన త్యాగమూర్తిని
- కనికరింప వచ్చిన కరుణశీలుని
కృపజూపవచ్చిన
కృపాకరుని - దాపుచేరనిచ్చిన
దాక్షిణ్యపూర్ణుని
రండి చేరి కొలిచెదం -
రారండి కలసి పాడుదాం
రండి యేసుననుసరించుదాం -
పదండి ప్రభుని చూపించుదాం |కన్నుల|
No comments:
Post a Comment