నా తండ్రి నన్ను మన్నించు
నా తండ్రి నన్ను మన్నించు – నీకన్న ప్రేమించే వారెవరు? ||2||
లోకంనాదేయని నిన్ను విడిచాను – ఘోర పాపిని నేను యోగ్యతే లేదు ||2||
ఓ మోసపోయి తిరిగి వచ్చాను – నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
1. నీదు బిడ్డగా నే పెరిగి – నీ ప్రేమను చూడలేక
పోయాను
నే చూచిన ఈలోకం – నన్నెంతో మురిపించింది ||2||
నీబంధం తెంచుకుని – దూరానికి పరుగెత్తాను
నేనమ్మిన ఈలోకం శోకమునే చూపించింది ||లోకంనాదే||
2. నీ కన్నులు నాకొరకు ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు ||2||
నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమ ఎంతో చూపితివే ||నా తండ్రి||
NAA THANDRI NANNU MANNINCHU
Naa thandri nannu
manninchu
Naa thandri nannu
manninchu
Nee kanna
preminchevarevaru
Lokam nadhey ani
ninnu vidichanu
Ghorapaapini nenu
yogyathe ledu
Oo..mosapoyi thirigi
vachanu
Nee premaney kori
thirigi vachanu
1. Needhu biddaga perigi
ni premane chudaleka
poyanu
Ney chuchina ee
lokam
Nannentho
muripinchindhi
Nee bandham
thenchukuni dhooranikey parigettanu
Ney nammina ee lokam
shokamuney chupinchindhi
|| Naa tandri ||
2. Nee kannulu na koraku
Yenthaga
yedhuruchuchinavo
Ninnu minchina prema
Yekkada kanaraledu
Ney chanipoyi
brathikanani thirigi neeku dorikanani
Gundelaku
hathukontivey ni prema yentho chupithivey
|| Naa
tandri ||