"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: Kummari o kummari | Telugu christian worship songs | Telugu christian songs

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Kummari o kummari | Telugu christian worship songs | Telugu christian songs



"Yet you, LORD, are our Father. We are the clay, you are the potter; we are all the work of your hand"

Isaiah 64:8
కుమ్మరి కుమ్మరి జగతుత్పత్తిదారి
కుమ్మరి కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
చల్లగ చూడుమయ్యా

పనికిరాని పాత్రనని – పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగానన్ను నింపుమా ||2||
సువార్తలోని పాత్రలన్నీశ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసిసత్యముతో నింపుము తండ్రి
సత్యముతో నింపుము తండ్రి  ||కుమ్మరి||

విలువలేని పాత్రను నేనుకొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి ||2||
ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా
సరిచేసి వాడుమయ్యా  ||కుమ్మరి||

లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని ||2||
పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్
నీ పాదంబుల్ పట్టితిన్  ||కుమ్మరి||




No comments:

SONG REQUEST

Name

Email *

Message *