నే సాగెద యేసునితో
నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా ||2||
నా జీవిత కాలమంతా ||2||
యేసుతో గడిపెద యేసుతో నడిచెద ||2||
పరమును చేరగ నే వెళ్లెద ||2||
పరమును చేరగ నే వెళ్లెద ||2||
హనోకు వలె సాగెదా ||నే సాగెద||
వెనుక శత్రువులు వెంటాడిననూ ||2||
ముందు సముద్రము ఎదురొచ్చినా ||2||
ముందు సముద్రము ఎదురొచ్చినా ||2||
మోషె వలె సాగెదా ||నే సాగెద||
లోకపు శ్రమలు నన్నెదిరించినా ||2||
కఠినులు రాళ్ళతో హింసించినా ||2||
కఠినులు రాళ్ళతో హింసించినా ||2||
స్తెఫను వలె సాగెదా ||నే సాగెద||
బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే ||2||
క్రీస్తుకై హత సాక్షిగా మారిన ||2||
క్రీస్తుకై హత సాక్షిగా మారిన ||2||
పౌలు వలె సాగెదా ||నే సాగెద||
తల్లి మరచిన తండ్రి విడచిన ||2||
బంధువులే నన్ను వెలివేసినా ||2||
బంధువులే నన్ను వెలివేసినా ||2||
బలవంతుని వలె సాగెదా ||నే సాగెద||
No comments:
Post a Comment