దేవాదిదేవుడు – మహోపకారుడు
దేవాదిదేవుడు – మహోపకారుడు
మహాత్యముగల మహారాజు
ప్రభువుల ప్రభువు – రాజుల రాజు
ఆయన కృప నిరంతరముండును
1. సునాద వత్సరము – ఉత్సాహసునాదము
నూతన సహాస్రాబ్ది – నూతన శతాబ్దము
ఉత్తమదేవుని దానములు
2. యుగములకు దేవుడవు – ఉన్నవాడవు అనువాడవు
జగమంత ఏలుచున్న - జీవాధిపతి నీవే
నీదు క్రియలు ఘనమైనవి
3. తంతి వాద్యములతో – తంబుర సితారతో
మ్రోగు తాళములతో – గంభీర ధ్వనులతో
సకల ప్రాణులు స్తుతించెదరు
4. అద్వితీయ దేవుడవు – ప్రభువైన యేసుక్రీస్తు
మహిమ మహత్యములు – సర్వాధి పత్యమును సదా నీకె కలుగునుగాక