గానము జేయుడు
సుకీర్తనను
గానము జేయుడు సుకీర్తనను =
యెహో – వాను గూరిచి క్రొత్త – గాను రక్తిగను
1.
తన్నామము నుతించి యతని – రక్ష – జెన్నుగ సారె బ్ర – సిద్ధము
జేసి = పన్నుగ నన్యులలో దన్యహిమ – యం – దున్నత చిత్రము – లను జాటండి
2.
ఘనతయు మహత్యమును – ద – ద్ఘనని యెదుటనుండు – ఘనబలమును =
వినతమౌ సౌందర్యమును – న – తనని నిర్మల స్థల – మున విలసిల్లు
3.
పరిశుద్ధాలంకారముతో – నా – పరమాత్మారాధన – పరులై యుండుడి =
ధరణి సకల జనులారా – లోక – గురుని యెదుట భీతి – గొనుచు నుండండి
4.
పరిపాలించుచున్నాడనుచు తోడి – నరులతో జెప్పుడి – ద్గుర
గదకుండ – స్థిరముగ జేయు సత్యముగా – జనుల – కరిమురిగాను న్యా – యము విమర్శించు
5.
ఏమనిన నా మహాత్ముండు – వచ్చు – నీ మహికి న్యాయము – నేర్పరచుటకు
= భూమి జనులకు నీతి సత్య – ముల – తో మించు న్యాయ మెం - తో విమర్శించు
6.
జనులారా యా యెహోవాకు – మహి – మను బలమును సమర్పణము జేయండి
వినయముతో గానుకలను – తీసి – కొని తత్ప్రాకారమందున వసియింపండి
No comments:
Post a Comment