నీతో సమమెవరు
నీలా ప్రేమించెదెవ్వరు
నీతో సమమెవరు నీలా
ప్రేమించెదెవ్వరు
నీలా క్షమించేదెవరు యేసయ్యా
నీలా పాపికై ప్రాణము
పెట్టిన వారెవ్వరు
1.
లోక బంగారము ధన ధాన్యాదులు
ఒక పోగసిన నీతో సరితూగునా
జీవనదులన్నీయు సర్వ
సాంద్రాములు
ఒకటై ఎగసిన నీకు తాకగలవా
నీలా పరిశుద్ధ దేవుడు ఎవరు
ఉన్నారయ్యా
నీవేగా మంచి దేవుడవు
2.
పలువేదాలలో మత గ్రంధాలలో
పాపమే శోకనీ పరిశుద్ధుడేడి
పాపపరిహారార్ధం సిలువ
మరణమొంది తిరిగి
లేచినట్టి దైవ
నరుడెవ్వరు...
నీలా జాలిగల ప్రేమగల
దేవుడేడి
నీవేగా మా విమోచకుడవు
3.
నేను వేదకకున్నా నాకు దొరికితివి
నే ప్రేమించకున్నా నన్ను
ప్రేమించితివి
నీకు గాయాలు చేసి తరచు
రేపితినీ
నన్నెంతో సహించి
క్షమించితివి
లోక సౌఖ్యలన్ని ఒక చోట
కుమ్మరించినా
నీవేగా చాలిన దేవుడవు
No comments:
Post a Comment