బేత్లెహేములో సందడి
బేత్లెహేములో సందడి – పశువుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని ||2||
1.
ఆకాశములో సందడి – చుక్కలలో సందడి
వెలుగులలో సందడి మిలమిల మెరిసే సందడి
2.
దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి
3.
దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి
జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి
No comments:
Post a Comment