సర్వోన్నతమగు –
స్థలములలో
సర్వోన్నతమగు – స్థలములలో – హల్లెలూయా ||2||
ఆయన నామమునకు మహిమ – హల్లెలూయా ||2||
ఆయన ప్రియులకు ఈ భువిలో – హల్లెలూయా ||2||
శాంతి సమాధానములు – కలుగును – హల్లెలూయా ||2||
ఏలయనగా నేడు మనకై – శిశువుపుట్టెగా ||2||
కరుణించి – పరలోకమునకు – దారి చూపగా
1.
తూర్పు వైపున – ఒక తార – ఉదయించెనుగ శుభవేళ
అది చూపె మార్గమందె – కనబడును రక్షణ పురము
అది యిరుకు మార్గమని వెరవకుమా
నిను కాపాడ ప్రభువు – సంసిద్దుడు ఎళవేళ
2.
దూరపయనమని – మది తలచి
నిర్లక్ష్యముతో నిలువకుమా
విశ్వాసముతో పరిగిడుమా
నీ కొసగును – రక్షణ ఫలము
ఆ తారవెలుగులో – ప్రసరించి
తెరువుమా – నీ హృదయమునే
ఈ క్రిస్ మస్ – శుభవేళ
No comments:
Post a Comment