"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: January 2018

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Yesu nee naamamrutamu

యేసు నీ నామామృతము
యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా – దేవ = మా – దోసములను హరించి మోక్షని – వాసులుగ జేయుటకు – భాసుర ప్రకాశమైన
1.    వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి – దేవ = యెంతో – కీడు జేసిన పాడు వైరిని – గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి
2.    పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా – దేవ = నీ – దాపు జేరిన వారి కందరి – కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు
3.    అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే – దేవ = మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు – రక్షణకు  దీక్ష గొని – వీక్షితులమైన మాకు
4.    అందమగు నీ మందిరమున – బొందుగా మేము – దేవ = నీ – సుందర కరుణామృతము మా – డెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన 

  PPT 📥

Trahimam kreesthu naadha | Christian songs telugu lyrics | Telugu christian songs latest




త్రాహిమాం క్రీస్తు నాథ దయ జూడ రావే
త్రాహిమాం క్రీస్తు నాథ దయ జూడ రావే
నేను దేహి యనుచు నీ పాదములే
దిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం||

గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై
రవ్వ పాలై నేనెంతో నెవ్వ బొందితి
త్రవ్వుచున్న కొలది పెరుగు దరగదు నా పాప రాశి
యివ్విధమున జెడిపోతిని నే నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం||

నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జా చిత్తము బూని
చేయరాని దుష్కర్మములు చేసినాడను
దయ్యాల రాజు చేతిలో జేయి వేసి వాని పనుల
జేయ సాగి నే నిబ్భంగి జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో ||త్రాహిమాం||

నిబ్బర మొక్కించుకైన నిజము రవ్వంతైన లేక
దబ్బర లాడుతకు ము త్తా నైతిని
అబ్బురమైన ఘోర పా పాంధకార కూపమందు
దబ్బున బడిపోతి నయ్యో దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహిమాం||

నిన్ను జేరి సాటిలేని నిత్యానంద మంద బోవు
చున్నప్పుడు నిందలు నా కెన్ని చేరినా
విన్నదనము లేకుండ నీ వే నా మదికి ధైర్యమిచ్చి
యన్నిట రక్షించితివి నా యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహిమాం||

Download Lyrics as PPT



Shudda Hrudayam kaluga jeyumu



"Create in me a pure heart, O God, and renew a steadfast spirit within me"

Psalm 51:10


"Heal me , Lord , and I will be healed ; save me and I will be saved, for you are the one I praise."

Jeremiah 17:14

 

శుద్ధ హృదయం కలుగ జేయుము
శుద్ధ హృదయం కలుగ జేయుము (2)
నాలో నా .... నాలో నా .. (2)

1.                నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరము చూపించుము(2)
పాపము చేశాను దోషినై యున్నాను (2)
తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నది నా పాపములే(2)
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్య (2)
                           
2.                నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుమా (2)
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం (2)
కలుగజేయుము నా హృదయములో (4)
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా


SHUDHDHAA HRUDAYAM
Shudhdhaa hrudayam kalugajeyumu
Naalonaa Naalonaa
1. Nee Vaathsalyam Nee Baahulyam
Nee Krupaa Kanikaram Choopinchumu
Paapamu Chesaanu Doshinai Unnaanu
Thelisiyunnadi Naa Athikramame
Thelisiyunnadi Naa Paapamule
    Nee Sannidhilo Parishudhdhaathmatho
    Nannu Nimpumayyaa
2. Nee Gnaanamunu Nee Sathyamunu
      Naa Aantharyamulo Puttinchumu
      Utsaaha Santhosham Nee Rakshanaanandam
      Kalugajeyumu Naa Hrudayamulo
      Nee Sannidhilo Naa Paapamule Oppukondunayyaa



Aananda magu mukti



ఆనంద మగు ముక్తి – యే నా మందిరము
ఆనంద మగు ముక్తి – యే నా మందిరము = జ్ఞాని మానుగ జూచు – దాని సుందరము
1.               పరదేశివలె దేహా – వరణమం దుందున్ – ధరణి కాననముగా – దర్శించు చుందున్ – నెరి దుఃఖసుఖములు – సరిగా భావింతున్ = పరిశుద్ధాత్ముని వేడి – పరితృప్తి నుండు
2.               బహు శోధనలు నాపై – బడి వచ్చునపుడు – నహితాంధతమము న – న్నడ్డుకొన్నపుడు – నిహబాధ లన్నిన – న్నెదిరించినపుడు = నహహ యేసునివల్ల – నమృతుడ నెపుడు
3.               ముందు నా మనసు దే – వుని కప్పగింతు – నందరి సస్మత్తు – ల్యముగా ప్రేమింతున్ – సందేహ రాహిత్య – సరణిలో నిల్తు = పొంద బోయెడి ముక్తి – భువి యందె గాంతు

Saaskamiccheda mana swami yesu


సాక్ష్య మిచ్చెద – మన స్వామి యేసు దేవు డంచు
సాక్ష్య మిచ్చెద – మన స్వామి యేసు దేవు డంచు = సాక్ష్య మనగ గనిన వినిన – సంగతులను దెల్పుటయే – సాక్ష్య మిచ్చు కొఱకు నన్ను స్వామి రక్షించె నంచు
1.               దిక్కు దెసయు లేని నన్ను – దేవుడెంతో  కనికరించి = మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినాడో
2.               పల్లెటూళ్ళ జనుల రక్షణ – భారము నాపైని గలదు – పిల్లలకును బెద్దలకును – బ్రేమతో నా స్వానుభవము
3.               బోధ చేయలేను వాద – ములకు బోను  నాక దేల = నాధు డేసు ప్రభుని గూర్చి – నాకు దెలిసినంత వరకు
4.               పాపులకును మిత్రు డంచు – బ్రాణ మొసగి లేచె నంచు = బావముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు
5.               చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన = ఘోరపాపు లైన క్రీస్తు – కూర్మితో రక్షించు నంచు
6.               పరమత దూషణము లేల  – పరిహసించి పలుకు టేల = ఇరుగు పొరుగు వారి కెల్ల – యేసు క్రీస్తు దేవు డంచు
7.               ఎల్లకాల మూరకుండ – నేల యాత్మ శాంతి లేక = తల్లడిల్లు వారలకును – తండ్రి కుమా రాత్మ పేర

SONG REQUEST

Name

Email *

Message *